హైదరాబాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటన నేర్పిస్తానని వినయ్ వర్మ అనే వ్యక్తి అమ్మాయిలని నగ్నంగా ఉండాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయం బయటకి రావడంతో నటి శ్రీరెడ్డి స్పందించింది. ఈ విషయంపై టాలీవుడ్ హీరోలు స్పందించకపోవడంతో ఆమె మండిపడింది.

ఒక్క హీరో కూడా బయటకొచ్చి మాట్లాడకపోవడంతో వాళ్లను గాజులు తొడుక్కొని, చీరలు కట్టుకోమని ఫైర్ అయింది. ఆడవాళ్లకు సమస్య వచ్చినప్పుడు కొంచెమైనా సామాజిక బాధ్యత లేకపోతే మీరు హీరోలుగా పనికిరారని కామెంట్స్ చేసింది.

సినిమాలలో మాత్రం చాలా బిల్డప్ లు ఇస్తారని, ఇండస్ట్రీలో పనిచేస్తూ లాంటి దారుణాలు జరుగుతున్నా బయటకొచ్చి మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శలు చేసింది. టీ గ్లాస్ పట్టుకొని పోజులు ఇస్తూ, మొక్కలు నాటుతున్నట్లు యాక్టింగ్ చేస్తూ.. అమ్మాయికి సమస్య వస్తే మాత్రం  బయటకొచ్చి ఒక్కమాట కూడా మాట్లాడారని బాధ్యత అసలు లేదనితన అభిప్రాయాన్ని వెల్లడించింది.

అమ్మాయిలు బయటకొచ్చి పోరాటం చేస్తుంటే మాత్రం వారిపై నిందలు వేస్తారని.. ఇలాంటి విషయాలు బయటకి వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండడానికి సిగ్గుగా లేదా అంటూ హీరోలపై తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది.