సినీనటి శ్రీరెడ్డి టీవీ9 ఛానల్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలు కూడా అమ్మాయిల్ని పొలిటికల్ లీడర్స్ దగ్గరకు పంపించి పబ్బం గడుపుకుంటారని వ్యాఖ్యానించారు. హీరోలు, డైరెక్టర్లు కూడా బ్రోకర్లేనని ఆమె అన్నారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎంత దారుణంగా ఉందో ఆమె కన్నీటిపర్యంతమై కుండబద్ధలు కొట్టింది.ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కష్టపడుతున్నా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఆమె వాపోయారు. నటిగా పర్సనాలిటీని చక్కగా మెయిన్‌టైన్ చెయ్యాలి.. బాగా వర్కవుట్స్ చెయ్యాలి.. ఇంత చేసి పెద్దగా తినడానికి కూడా ఉండదు.. నిద్రానిప్పుల్లేకుండా తన లాంటి అమ్మాయిలు బ్రతుకుతున్నామని శ్రీరెడ్డి అన్నారు.