రకుల్ నీ పళ్లు రాళ్లకొడతా : శ్రీరెడ్డి

Sri reddy direct attack on rakul
Highlights

రకుల్ నీ పళ్లు రాళ్లకొడతా ఏమనుకుంటున్నావ్

గత కొన్ని రోజులుగా మీడియాలోనూ, సామజిక మాధ్యమాల్లోనూ నటి శ్రీరెడ్డి సంచలనంగా మారింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, అంతే ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ హల్ చల్ సృష్టిస్తోంది. శ్రీరెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్ లో కాక రేపుతున్నాయి. తనకు టాలీవుడ్ లో ప్రముఖులు అన్యాయం చేసారని శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ లో జరుగుతున్న దారుణాలు గురించి శ్రీరెడ్డి మాట్లాడుతోంది.

 తాజగా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి.

ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎంకు తన బాధను వ్యక్తపరిచింది. 'కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే... నిరాహారదీక్ష చేస్తా. గతంలో మీరు పోరాడి, విజయం సాధించిన మార్గాన్నే నేను ఎంచుకున్నా. మీరు ఇప్పటికీ స్పందించకపోతే, పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు' అని ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ఇవాళ శ్రీరెడ్డిని ఒక విలేఖరి ప్రశ్న అడుగుతూ రకుల్ ప్రీత్ సింగ్ అసలు కాస్టింగ్ కౌచ్ లాంటివి ఏవి పరిశ్రమలో లేవని ఇవన్ని వట్టి గాలి వార్తలే అని కొట్టిపారేసిన విషయాన్ని గుర్తు చేయగా శ్రీరెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యింది. కోట్లు కోట్లు సంపాదిస్తూ జిమ్ములు - పబ్బులు - రెస్టారెంట్లు నడుపుకునే వాళ్ళకు తనలాంటి వాళ్ళ కష్టాలు కనిపించవని దెప్పి పొడిచింది. ఇంకోసారి తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ ఉద్యమం గురించి చులకనగా మాట్లాడితే రకుల్ పళ్ళు రాలగొట్టి కట్టుడు పళ్ళ కోసం ముంబై పరిగెత్తేలా చేస్తానని నేరుగా వార్నింగ్ ఇవ్వడం అక్కడున్న వాళ్ళను విస్తుపోయేలా చేసింది. శేఖర్ కమ్ముల ని కూడా ఈ ఇష్యూ లోకి లాగింది శ్రీ రెడ్డి. ఆ తరువాత శేఖర్ కమ్ముల తన ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి సారీ చెప్పాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించి ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారని ఆమె ప్రశ్నించింది 

మరో రెండు రోజుల్లో తన సభ్యత్వం గురించి స్పందన రాకపోతే ఎవరూ ఊహించని చర్యకు పాల్పడతానని చెబుతున్న శ్రీరెడ్డి అదేంటి అనేది మాత్రం గుట్టు విప్పలేదు. తన దగ్గర వీడియోలు - పెద్ద వాళ్ళ గురించి సాక్ష్యాలు ఉన్నాయని కేవలం ఇండస్ట్రీ మీద గౌరవంతో బయట పెట్టడం లేదని చెబుతున్న శ్రీరెడ్డి రెండు మూడు రోజుల తర్వాత ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

loader