ఇప్పటి వరకు మనం శ్రీరెడ్డి లీక్స్ చూశాం. ఫిలిం ఇండస్ట్రీ లో తనకు అన్యాయం జరిగిందంటు చేసిన పోరాటంలో చాలా వరకు అందరి గుట్టు విప్పిసింది. ఇంతా టాలీవుడ్ లో అందరిని ఒక ఆట ఆడుకున్న శ్రీరెడ్డి. ఇప్పుడు శ్రీరెడ్డి ని టార్గెట్ చేస్తూ కరాటే కళ్యాని లీక్స్ స్టార్ట్ చేసింది. 

‘కల్యాణి లీక్స్ మొదలయ్యాయి. పెళ్లి కాని విమలకు(శ్రీరెడ్డి అసలు పేరును చెబుతూ) ఇంటర్‌ పూర్తిచేసిన కూతురుంది. గడిచిన 10 ఏళ్ల నుంచి తల్లిదండ్రులతో సంబంధాలు లేవని శ్రీరెడ్డి చెప్పింది. కానీ కొంతకాలం కిందట కూకట్‌పల్లిలో కోట్ల విలువైన ఫ్లాట్‌లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఆమె వెంట తల్లికూడా ఉన్నారు. ఇదికాకుండా తను ఖరీదైన కార్లలో తిరుగుతుంది. ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయో ఆమెకే తెలియాలి. మరికొన్ని లీక్స్‌ నాకు నచ్చినప్పుడు బయటపెడతా.. నా లీక్స్ నా ఇష్టం’’ అని నటి కరాటే కల్యాణి తన పేస్ బుక్ ఖాతాలో ఫోటోలను బహిర్గతం చేసింది.