టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ వివాదాస్పద కామెంట్స్ చేసి పెద్ద దుమారానికి తెరలేపింది శ్రీరెడ్డి. టాలీవుడ్ లో ఉన్న హీరోలు, డైరెక్టర్లు ఇలా ఒకరా ఇద్దరా ఇండస్ట్రీలో ఉన్న చాలా మందిపై నోటికొచ్చినట్లు కామెంట్ చేసింది. నాని, శేఖర్ కమ్ముల వంటి సెలబ్రిటీలు శ్రీరెడ్డిపై లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నామని ప్రకటించారు. ఇక దర్శకుడు కొరటాల శివ గురించి శ్రీరెడ్డి నీచంగా మాట్లాడడంతో ఆయన శ్రీరెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని ఒక వీడియో విడుదల చేశాడు.

ఇప్పటికీ కూడా శ్రీరెడ్డి ఎవరో ఒకరిని తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా టార్గెట్ చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా ఆమె టార్గెట్ చేసింది ఎవరినో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. తమిళనాట స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దర్శకుడు మురుగదాస్ అప్పుడప్పుడు తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు. అటువంటి డైరెక్టర్ గురించి ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తమిళ డైరెక్టర్ మురుగదాస్ గారు మీకు గ్రీన్ పార్క్ హోటల్ గుర్తుందా..? వెలిగొండ శ్రీనివాస్ గారు ద్వారా మిమ్మల్ని కలిశా కదా అంటూ మొదలుపెట్టిన పోస్ట్ లో ఆయనపై నెగెటివ్ మీనింగ్ వచ్చే విధంగా కామెంట్ చేసింది. ఈ ఆరోపణలు షాకింగ్ గా ఉన్నాయి. నిజంగానే ఆమె దగ్గర వీటికి తగ్గ ఆధారాలు ఉన్నాయా..? లేక కావాలని ఈ విధంగా టార్గెట్ చేసి మాట్లాడుతుందా..? అనే విషయంలో స్పష్టత లేదు. ఇంకెంతకాలం ఇలాంటి పోస్ట్ లు పెడుతూ కాలం గడుపుతుందో చూడాలి!