శ్రీరెడ్డి: చిరు, పవన్ లపై విరుచుకుపడింది!

First Published 13, Jul 2018, 6:21 PM IST
sri reddy comments on mega brothers
Highlights

కాస్టింగ్ కౌచ్ కోసం పోరాటమని చెప్పి ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలపై కామెంట్స్ చేస్తూనే మరోపక్క రాజకీయాలపై నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తోంది నటి శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ పై రోజుకొక పోస్ట్ పెడుతూ ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణమవుతుంది. 

కాస్టింగ్ కౌచ్ కోసం పోరాటమని చెప్పి ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలపై కామెంట్స్ చేస్తూనే మరోపక్క రాజకీయాలపై నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తోంది నటి శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ పై రోజుకొక పోస్ట్ పెడుతూ ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణమవుతుంది. వారు ఆమెను సోషల్ మీడియాలో ఎంతగా ట్రోల్ చేస్తున్నా శ్రీరెడ్డి మాత్రం పవన్ పై పోస్ట్ లు పెట్టడం మానడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్ లో మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ అతడితో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా మధ్యలోకి లాగింది.

''16 ఏళ్లు పెంచుకున్న పాపని కాంగ్రెస్ నాయకులు మోసం చేసి ఢిల్లీలో నేషనల్ ఛానెల్స్ ముందు కూర్చోబెడితే మా కడుపు ఉడికిపోయిందన్న పవన్.. మరి మీ అన్నయ్య ఇంకా కాంగ్రెస్ లో ఎందుకు కొనసాగుతున్నారు. ఓట్ల కోసం ఆయన అభిమానుల ద్వారా మీకు ఎలా సహాయపడుతున్నారు. దీనిపై మీ అన్నయ్య సిగ్గుపడడం లేదా..? అన్నం పెట్టేవారినే మోసం చేస్తారా'' అంటూ మెగాబ్రదర్స్ ఇద్దరినీ టార్గెట్ చేసింది.

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ వివాహం విషయంలో కాంగ్రెస్ నేతలు తమ బిడ్డను బజారుకీడ్చారు అంటూ పవన్ రీసెంట్ గా ఓ మీటింగ్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై శ్రీరెడ్డి మెగాబ్రదర్స్ ను టార్గెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

loader