పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా 'గాజు గ్లాసు'ని కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. తమకు కేటాయించిన గుర్తుపై పవన్ తో పాటు జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సామాన్యుడి తాగే టీ గ్లాస్ ని పోలి ఉండడంతో ఇది సామాన్యుడి గుర్తు అంటూ జనసేన పార్టీ ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ఆ పార్టీ గుర్తుపై సినీ నటి శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీని, నాగబాబుని కించపరుస్తూ ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టింది.

అందులో ఏముందంటే.. ''అరె.. జనసేన పార్టీ గుర్తు గలాసు అంటగా.. అది బీరు గ్లాసా..? వైన్ గ్లాసా..? స్కాచ్ గ్లాసా..? పనిలో పనిగా నాగబాబు గారికి కూడా ఓ గ్లాస్ ఇవ్వండర్రా.. అసలే రీసెంట్ గా కొత్త గొంతు వచ్చిన అందంలో ఏం మాట్లాడుతున్నాడో.. అర్ధం కావట్లేదు'' అంటూ రాసుకొచ్చింది.

శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ చూసిన అభిమానులు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలకు ఈ గాజు గ్లాసులో టీ కనిపిస్తుంటే.. శ్రీరెడ్డికి మాత్రం మందు కనిపిస్తుందంటూ రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.