టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని పలువురుని టార్గెట్ చేస్తూ నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు మొత్తం ఇండస్ట్రీను కుదిపేశాయి. అయితే ఓ వారం రోజులుగా సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి మళ్ళీ ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. మొన్నటివరకు హీరో నానిపై పరోక్షంగా కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి ఈరోజు నేరుగా ఆయన పేరునే ప్రస్తావించింది.

''తెర మీదకు వచ్చేసరికి ఒక్కొక్కడు శ్రీరంగ నీతులు చెప్తారు, మన నేచురల్ స్టార్ నాని ఒక అమ్మాయికి ఒక రోజంతా నరకం చూపించాడు, కాసుకోర నాని నీ టోకెన్ వచ్చింది, నీకు ఫ్యామిలీ ఉందిగా, కొంచెం కూడా సిగ్గులేదా అలా చేయటానికి ఛి'' అంటూ నానిని టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది.

గతంలో శేఖర్ కమ్ములపై కూడా ఈ విధమైన ఆరోపణలే చేస్తే ఆయన లీగల్ గా చర్యలు తీసుకుంటానని రియాక్ట్ అయ్యారు. ఆ తరువాత నేను మిమ్మల్ని అనలేదంటూ మాట మార్చేసింది. మరి ఇప్పుడు నాని విషయంలో ఆమె చేసిన ఆరోపణల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది. మరి ఈ విషయంపై నాని ఏమంటాడో చూడాలి.