నీ యవ్వారాలు ఎవరికి తెలియవు..? కమెడియన్ పై శ్రీరెడ్డి కామెంట్స్!

sri reddy comments on comedian prudhvi
Highlights

వారికి ఇష్టమయ్యే కదా వెళ్లారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఇబ్బందిపెడితే అప్పుడే మహిళా సంఘాలకి చెప్పి ఉండొచ్చు లేదా నిర్భయ చట్టం తెచ్చారు.. ఫిర్యాదు చేయొచ్చు కదా..? కానీ అప్పుడేమో సైలెంట్ గా ఉండి, ఇప్పుడు ప్రచారం కోసం మీడియా ముందుకు వస్తున్నారు

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా కమెడియన్ థర్టీ ఇయర్స్ పృథ్విపై కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఆయన బిగ్ బాస్ షోపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జనాల్ని పిచ్చోల్ని చేయడానికి ఇలాంటి షోలు నడుపుతున్నారని, తాను గనుక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్తే అందరినీ కడిగిపారేస్తానంటూ దుయ్యబట్టారు.

అలానే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. 'వారికి ఇష్టమయ్యే కదా వెళ్లారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఇబ్బందిపెడితే అప్పుడే మహిళా సంఘాలకి చెప్పి ఉండొచ్చు లేదా నిర్భయ చట్టం తెచ్చారు.. ఫిర్యాదు చేయొచ్చు కదా..? కానీ అప్పుడేమో సైలెంట్ గా ఉండి, ఇప్పుడు ప్రచారం కోసం మీడియా ముందుకు వస్తున్నారు' అంటూ శ్రీరెడ్డిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు.

మరి శ్రీరెడ్డి ఊరుకుంటుందా..? వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్ లో పృథ్విని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. 'కామెడీ పృథ్వి.. నీ గోకుడు యవ్వారాలు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో తెలియవా..? లేక అమెరికా ఈవెంట్స్ కి వెళ్లిన అమ్మాయిలకు తెలియవా..? ఎమ్మెల్యే టికెట్ కావాలంట' అంటూ అసభ్యపదజాలంతో పృథ్విపై కామెంట్స్ చేసింది.  

loader