శ్రీరెడ్డి ఒక్కోసారి సెన్సేషన్ కోసం మాట్లాడుతోందో లేక సామాజిక అంశాలపై స్పందిస్తోందో అర్దంకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంది. ఈ మధ్యకాలంలో కాస్త జోరు తగ్గించింది అనుకునే లోగా పవన్ పుట్టిన రోజు సందర్బంగా ఓ పోస్ట్ పెట్టింది. పవన్‌ కళ్యాణ్‌పై పై గతంలో ఎన్నో  సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె ఆయన పుట్టిన రోజుకు ఎలా స్పందించిందో అనే ఆసక్తి కలగటం సహజం. ఇంతకీ శ్రీరెడ్డి ఏమని పోస్ట్ పెట్టింది...  ఎక్కడేం జరిగినా దాన్ని తెలుగు సినీ పరిశ్రమకు ముడిపెడుతూ రెచ్చిపోయే స్టేట్మెంట్స్ ఇచ్చే..శ్రీరెడ్డి ..తాజాగా ఏమందో చూద్దాం. 

 పవన్ కళ్యాణ్ అభిమానులు ఊహించని విధంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేసింది శ్రీరెడ్డి.‘ ఐ హేట్ యు బట్ హ్యాపీ బర్త్ డే పీకే’ అంటూ విషెష్ అందించింది శ్రీరెడ్డి. పవన్ ఫ్యాన్స్ చాలా మంది దాంతో పుట్టిన రోజున బూతుల దండకం అందుకోకుండా ఇలా విషెష్ చెప్పినందుకు ఆనందపడుతున్నారు.

ఇక వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలకు తెరలేపిన నటి శ్రీరెడ్డి. క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో టాలీవుడ్‌ను ఊపేసి.. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేసింది. అడపాదడపా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ వస్తోంది.ఆ తర్వాత పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో శ్రీ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమె చేసిన పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి.

గతంలో ..పవన్ కళ్యాణ్ తన జనసేనను ఏ పార్టీలోనూ కలపనని చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి తన స్టైల్లో స్పందించింది. ‘పవన్‌ గారు మీ పార్టీని మరేతర పార్టీలోనూ కలపకండి. ఒక్క విషపు చుక్క కూడా విలువైన మొత్తం ద్రావణాన్ని పాడు చేస్తుంది. మీరు మాకు వద్దు’ అంటూ పోస్ట్‌ చేసింది.