కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసాడని.. హీరో గోపిచంద్ కు ఇది వినిపించే ఓకే చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఏ చిత్రమూ లేదు.
చాలా రోజుల గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల ఓ హీరో తో కథ ఓకే చేయించుకుని, పట్టాలు ఎక్కించటానికి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. అది కూడా ఒకప్పుడు శ్రీను వైట్లను గుర్తు చేసేలా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసాడని.. హీరో గోపిచంద్ కు ఇది వినిపించే ఓకే చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఏ చిత్రమూ లేదు.
ఇంతకు ముందు మంచు విష్ణు కాంబినేషన్‌లో ఓ సినిమా అనుకుని ప్రకటన కూడా వచ్చింది. అయితే అది ఏమైందో తెలియదు. తర్వాత వేరే అప్డేట్స్ లేవు. దాంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని అంటున్నారు. ఈ క్రమంలో వేరే మిడ్ రేంజ్ హీరోలతో సినిమా అనుకున్నా అవీ ముందుకు వెళ్లలేదు. ఒకప్పుడు కామెడీ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు సైతం శ్రీనువైట్లకు ఛాన్స్ ఇవ్వడానికి అస్సలు ఆసక్తి చూపడం లేదు. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ గా నిలిచాయి. ఈ క్రమంలో రీసెంట్ గా గోపిచంద్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. లిమిటెడ్ బడ్జెట్ తోనే శ్రీను వైట్ల... గోపీచంద్ కాంబో సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది. ఈ మధ్య కాలంలో గోపీచంద్ కెరీర్ కూడా ఆశాజనకంగా లేదనే సంగతి తెలిసిందే.
వాస్తవానికి గోపిచంద్ హిట్టు చూసి తొమ్మిదేళ్లయింది. లౌక్యం తర్వాత ఇప్పటివరకు గోపిచంద్‌కు హిట్టే లేదు. మధ్యలో జిల్, గౌతమ్ నందా, సీటిమార్ వంటి సినిమాలు బాగానే ఆడినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయాయి. ఇక గతేడాది భారీ అంచనాల మధ్య రిలీజైన పక్కా కమర్షియల్ పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కు తీసుకురాలేకపోయింది. దాంతో తనకు అచ్చొచ్చిన దర్శకుడు శ్రీవాస్‌తో రామబాణం సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై కాస్తో కూస్తో మంచి బజ్‌నే క్రియేట్ చేశాయి. పైగా ఈ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
