తెలుగులో పాపులర్ అయిన యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. పటాస్ షోతో శ్రీముఖి యాంకర్ గా గుర్తింపు పొందింది. రష్మీ, అనసూయ లాంటి యాంకర్స్ కు పోటీగా రాణిస్తోంది. శ్రీముఖి నటిగా పలు చిత్రాల్లో కూడా నటించింది. శ్రీముఖి ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 

ఎలాంటి పాత్రలో నటించాలని ఉంది అనే ప్రశ్నకు శ్రీముఖి సమాధానం ఇచ్చింది. నేని రియల్ లైఫ్ లో చాలా మంచిదాన్ని. కాబట్టి సినిమాల్లో విలన్ రోల్స్ చేయాలని అనుకుంటున్నా. అలా అయినా నాలో విలనిజాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. విలన్ పాత్రల్లోనే నటనకు ఎక్కువగా అవకాశం ఉంటుంది అని శ్రీముఖి తెలిపింది. 

మరో నెటిజన్ మీకు మందు అలవాటు ఉందా అని సరదాగా సమాధానం ఇచ్చాడు. శ్రీముఖి మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానం ఇచ్చింది. నిజాయతీగా చెబుతున్నా.. నాకు మందు అలవాటు ఉంది. కానీ అప్పుడప్పుడు మాత్రమే. అది కూడా వైన్ మాత్రమే తాగుతాను. వైన్ ఆరోగ్యానికి మంచిది కూడా అంటూ శ్రీముఖి సమాధానం ఇచ్చింది. 

ఇక ప్రదీప్ చాలా టాలెంటెడ్ పర్సన్ అని ప్రశంసించింది. హైపర్ ఆది అమేజింగ్ రైటర్, రష్మీ చాలా డేరింగ్ అంటూ శ్రీముఖి తెలిపింది.