శ్రీలీల ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుంది.  ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం హిందీ నటుడు అర్జున్ రామ్‌పాల్‌ను తీసుకున్నారు.  బాలయ్యకు,శ్రీలీలకు కథాపరంగా ఉన్న రిలేషన్ ఏమిటి


బాలకృష్ణ #NBK108 చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈచిత్రం గురించి లేటెస్ట్‌గా ఓ చిన్న లీక్ బయిటకు వచ్చింది. ఈ చిత్రంలో శ్రీలీల పాత్ర ...బాలయ్య కు కూతురు అనే విషయం ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అది నిజం కాదని తెలిసింది. అయితే మరి బాలయ్యకు,శ్రీలీలకు మధ్య సినిమాలో రిలేషన్ ఏమిటి అంటే...

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎన్.బి.కె 108లో బాలకృష్ణ, శ్రీలీలు తండ్రీ కుమార్తె పాత్రలు కాదు.ఆమెకు బాబాయ్ పాత్రలో బాలయ్య బాబు కనిపిస్తారు. మరి, శ్రీలీల తండ్రి పాత్రలో ఎవరు కనిపించనున్నారు? అంటే... శరత్ కుమార్...ఈ సినిమాలో బాలకృష్ణకు అన్నయ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ హీరోగా డిఫరెంట్ యాక్షన్ డ్రామాను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.

రీసెంట్ గా అనిల్ రావిపూడి ఓ ఏమోషనల్ సీక్వెన్స్ చిత్రీకరించారు. బాలయ్య, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చే ఈ ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలెట్‌గా ఉంటాయని తెలుస్తోంది. కిడ్నాప్‌కి గురైన శ్రీలీలను సేవ్ చేయడానికి బాలయ్య చేసే ఫైట్స్‌ను టీమ్ వీరోచితంగా చిత్రీకరిస్తోంచారని తెలుస్తోంది. శ్రీలీల ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం హిందీ నటుడు అర్జున్ రామ్‌పాల్‌ను తీసుకున్నారు. ఇక వెనక,ముందు చూసుకోకుండా ముందుకు వెళ్లే దూకుడైన మనస్తత్వం కల హీరోగా బాలకృష్ణ క్యారెక్టర్ డిజైన్ చేశారట. శ్రీలీల, శరత్ కుమార్, హీరో మధ్య సీన్లు కొత్తగా ఉంటాయని తెలిసింది. సినిమాకు ఆ సీన్లు ఆయువు పట్టు లాంటివి అని తెలిసింది.

మరో ప్రక్క శ్రీలల..సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఆసక్తిర విషయాలను పంచుకుంది. బాలకృష్ణతో సినిమాలో తన క్యారెక్టర్ గురించి తెలిస్తే అందరూ షాక్ అవుతారని వివరించింది. తను బాలయ్యకు వీరభిమానిని తెలిపింది. చిన్నప్పటి నుంచి తనకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టమని వెల్లడించింది. ఆయనతో సినిమాలో నటిస్తున్నప్పటి నుంచి ఇంకా అభిమానించడం మొదలుపెట్టానని శ్రీలీల పేర్కొంది. బాలయ్యది ఎంతో గొప్ప వ్యక్తిత్వం అని కొనియాడింది. బాలకృష్ణతో సీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని..డైలాగ్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని శ్రీలీల స్పష్టం చేసింది. తన బిజీ షెడ్యూల్ తో ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది ఈ ముద్దుగుమ్మడు.

''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా బరిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.