యోగాలో పాల్గొన్న శ్రీలీల.. లుక్ మాత్రం కేక
అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 25రోజుల కౌంట్ డౌన్‌లో భాగంగా హీరోయిన్ శ్రీలీల యోగా వేడుకలో పాల్గొంది. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె చేతిలో ఇప్పుడు ఏకంగా ఎనిమిది సినిమాలుండటం విశేషం. తీరిక లేకుండా గడుపుతున్న ఈ బ్యూటీ తాజాగా యోగాలో పాల్గొంది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్ డౌన్‌ని పురస్కరించుకుని పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో హీరోయిన్ శ్రీలీల పాల్గొంది. నేడు(మే 27న) శనివారం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో ఈ బ్యూటీ పాల్గొంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం అనే విషయం తెలిసిందే.
ఇందులో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. యోగాసనాలు చేసి ఇన్‌స్పైర్ చేశారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించేందుకు, యోగా వల్ల ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి నటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో శ్రీలీల బ్లాక్ స్పోర్ట్స్ కంఫర్ట్ డ్రెస్‌లో మెరిసింది. చూపరులను ఆకట్టుకుంది. పరేడ్ గ్రౌండ్‌లో సెంటర్ ఆఫ్ ఎంట్రాక్షన్‌గా నిలిచింది. అయితే శ్రీలీల త్వరలో డాక్టర్ కూడా కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె రోజూ యోగాలో పాల్గొంటూ ఫిట్‌గా ఉండేలా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటుందట.
ఇక శ్రీలీల కెరీర్ పరంగా చూస్తే ఆమె టాలీవుడ్‌లోనే అత్యంత బిజీ యాక్ట్రెస్‌గా రాణిస్తుంది. స్టార్ హీరోల నుంచి యంగ్ స్టర్స్ వరకు అందరితోనూ కలిసి నటిస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అందులో భాగంగా శ్రీలీల ప్రస్తుతం.. మహేష్‌బాబుతో త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ లీడ్‌గా చేస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్`లోనూ నటిస్తుంది. బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న అనిల్ రావిపూడి మూవీ `ఎన్బీకే108`లో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు `అనగనగా ఒక రాజు` చిత్రంలో నవీన్ పొలిశెట్టితో, బోయపాటి, రామ్ చిత్రంలో, నితిన్ మూవీలో, ఓ కన్నడ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే చిరంజీవి హీరోగా రూపొందబోతున్న ఓ మలయాళ రీమేక్‌లోనూ శ్రీలీల పేరు వినిపిస్తుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించనుందని సమాచారం.