టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల తన బర్త్ డేని చాలా స్పెషల్‌గా మార్చుకుంది. ఆమె నటిస్తున్న సినిమాల కొత్త పోస్టర్ల పండగ నడుస్తుంది. తాజాగా కొత్త ప్రాజెక్్ట ని అనౌన్స్ చేశారు.
యంగ్ సెన్సేషన్ శ్రీలీల నేడు పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె పెద్ద జాక్ పాట్ కొట్టింది. అల్లు అర్జున్‌తో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్, బాలకృష్ణ వంటి స్టార్లతో కలిసి నటిస్తున్న శ్రీలీలకి ఇప్పుడు బన్నీతోనూ వర్క్ చేసే ఛాన్స్ రావడం, అది ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రకటన రావడం విశేషమనే చెప్పాలి. `ఆహా` ఓటీటీ సంస్థ కోసం బన్నీ, శ్రీలీల కలిశారు. వీరిని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. అయితే `ఆహా ఒరిజినల్` కోసం వీరిద్దరు కలిసినట్టు టీమ్ చెబుతుంది.
తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది టీమ్. ఇందులో అల్లు అర్జున్ చంకనెక్కి కూర్చుంది శ్రీలీల. ఈ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంది. శ్రీలీలకి ఇది బెస్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఇద్దరితో వెబ్ సిరీస్ చేస్తారా? ఓటీటీ ఫిల్మ్ చేస్తారా అనేది పెద్ద సస్పెన్స్. కానీ తాజాగా ఇన్‌సైడ్ టాక్స్ ప్రకారం బన్నీ, శ్రీలీల మీద ఒక యాడ్ షూట్ చేస్తున్నారని సమాచారం. ఆహాలో అల్లు అర్జున్ ఓ కొత్తగా `ఆహా ఒరిజినల్స్` ని లాంచ్ చేయబోతున్నారట. ఇందులో వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిల్మ్స్ నిర్మించబోతున్నారట. దీనికి సంబంధించిన బాధ్యత బన్నీ తీసుకుంటున్నారని, ఆయన నిర్మాణంలోనే ఇవన్నీ రూపుదిద్దుకుంటాయని సమాచారం. దాని ప్రమోషన్స్ కోసమే అల్లు అర్జున్, శ్రీలీల లపై ప్రమోషనల్ యాడ్ చేస్తున్నారని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
కానీ బన్నీ, శ్రీలీల కలిసి చేస్తున్నారనేది వార్త ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది. డాన్సుకి బ్రాండ్‌అంబాసిడర్‌గా మారుతున్న బన్నీతో, మరో డాన్సు సెన్సేషనల్‌గా పేరుతెచ్చుకుంటోన్న శ్రీలీల కలిసి స్టెప్పులేస్తే `ఆహా` దద్దరిల్లిపోవాల్సిందే అనేది టీమ్ రియాక్షన్. ఏదైనా గత కొన్ని రోజులుగా వీరంతా ఈ అప్‌డేట్లతో ఊరిస్తున్నారు. అసలు విషయాన్ని దాస్తూ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆతృతని పెంచేస్తున్నారు. మరి ఆ ఆతృతకి దగ్గట్టుగా ఫైనల్ అనౌన్స్ మెంట్ ఉంటుందా? లేక తుస్సుమనిపిస్తారా? అనేది చూడాలి.
ప్రస్తుతం బన్నీ `పుష్ప2` సినిమాలో బిజీగా ఉన్నారు. పుష్పరాజ్‌గా ఆయన మరోసారి ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు నేడు బర్త్ చే జరుపుకుంటున్న శ్రీలీల ప్రస్తుతం ఎనిమిది సినిమాల్లో నటిస్తుంది. `గుంటూరు కారం`, `ఉస్తాద్ భగత్ సింగ్`, `భగవత్ కేసరి`, `ఆదికేశవ`, `బోయపాటి రామ్ సినిమా, `అనగనగా ఒక రాజు`తోపాటు ఓ కన్నడ సినిమా చేస్తుంది. వరుస ఆఫర్లతో బిజీగా ఉంది శ్రీలీల.
