ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న `వినోదయ సీతం` రీమేక్‌లో  పవన్‌కి హీరోయిన్‌ లేదని సమాచారం.  తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్‌ వినిపిస్తుంది. సినిమాలో మాస్‌ ఆడియెన్స్ కోసం దర్శక, నిర్మాతలో ఓ మాంచి ఐటెమ్‌ సాంగ్‌ని ప్లాన్‌ చేశారట.

పవన్‌ కళ్యాణ్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గ్యాప్‌ లేకుండా వరుసగా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆయన `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తుండగా, ఇటీవలే `వినోదయ సీతం` రీమేక్‌ని స్టార్ట్ చేశారు. ఏకంగా రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా జరుపుతున్నారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌తోపాటు సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్నారు. పవన్‌ ది ఇందులో ఫుల్‌ లెన్త్ రోల్‌ కాదు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. 

అందుకే ఈ రీమేక్‌ చేస్తున్నాడు పవన్‌. రాజకీయాల కారణంగా తక్కువ ఖాల్షీట్లు ఉన్న సినిమాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన ఇరవై రోజులే కేటాయించారని సమాచారం. అంతేకాదు ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌కి హీరోయిన్‌ లేదని సమాచారం. సాయిధరమ్‌కి జోడీగా కేతికశర్మ, అలాగే కీలక పాత్రలో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నటిస్తుందని సమాచారం. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్‌ వినిపిస్తుంది.

సినిమాలో మాస్‌ ఆడియెన్స్ కోసం దర్శక, నిర్మాతలో ఓ మాంచి ఐటెమ్‌ సాంగ్‌ని ప్లాన్‌ చేశారట. అది టాలీవుడ్‌లోని నిలిచిపోయేలా ఉండాలని అనుకుంటున్నారట. ఆ ఒక్క పాటే సినిమాని ఊపేసేదిగా ఉండాలనుకుంటున్నారట. అయితే అందుకోసం ఓ రీమిక్స్ సాంగ్‌ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే బాలీవుడ్‌ లోని హిట్‌ ఐటెమ్‌ నెంబర్‌పై కన్నేశారట. 

అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, రాణి ముఖర్జీ కలిసి నటించిన హిట్‌ మూవీ `బంటి ఔర్‌ బబ్లీ` మూవీలోని `కజ్‌రారే` సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. సినిమా కంటే ఈ పాటే బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. ఇందులో ఐశ్వర్యా రాయ్‌ ఐటెమ్‌ నెంబర్‌లో స్టెప్పులేయడమే అందుకు కారణం. బిగ్‌ బీతోపాటు, అభిషేక్‌లతో కలిసి ఐశ్వర్యా ఈ ఐటెమ్‌ సాంగ్‌లో డాన్సు చేసి ఉర్రూతలూగించింది. ఈ పాట ఇప్పటికీ అలరిస్తుంటుంది. అయితే ఈ పాటని పవన్‌ సినిమాలో రీమిక్స్ చేయబోతున్నారట. 

పవన్‌ కళ్యాణ్‌,సాయిధరమ్‌ తేజ్‌లు ఇందులో ఆడిపాడనున్నారని, అయితే ఐశ్వర్య స్థానంలో శ్రీలీలాని తీసుకోవాలనుకుంటున్నారట. ఇటీవల శ్రీలీలా బాగా పాపులర్‌ అయ్యింది. ముఖ్యంగా ఆమె డాన్సులకు మంచి పేర్కొచ్చింది. `ధమాకా` సినిమాలో ఆమె చేసే డాన్సే హైలైట్‌గా నిలిచింది. సినిమా సక్సెస్‌లోనూ ఆమె కీలక భూమిక పోషించింది. ఈనేపథ్యంలో శ్రీలీలా అయితే ఆ క్రేజ్‌ మరింతగా ఉంటుందని, పవన్‌తో డాన్సులంటే ఇక ఉర్రూతలూగడం ఖాయమని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే కచ్చితంగా నిలిచిపోయే ఐటెమ్‌ సాంగ్‌ అవుతుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమాని ఆగస్ట్ లో విడుదల చేయబోతున్నారని సమాచారం.