Asianet News TeluguAsianet News Telugu

#Sreeleela ఆ క్రేజీ ఫిల్మ్ లో శ్రీలీల ఐటెం సాంగ్ ?

“వామ్మో అదేమి డ్యాన్స్… అదేమీ ఎనర్జీ” అని ఇటీవల ఆమె డ్యాన్స్ ని ఇంటర్వూలో  మెచ్చుకున్నారు హీరో మహేష్ బాబు. ఈ క్రమంలో  ఒక స్పెషల్ సాంగ్ చేయించాలనే ఐడియా వచ్చిందట

Sreeleela item song in #Pushpa2 movie? jsp
Author
First Published Jan 18, 2024, 4:18 PM IST


గుంటూరు కారం పేరు చెప్పి శ్రీలల పేరు  మరోసారి మారు మ్రోగిపోతోంది. ఈ సినిమాలో ఆమె వేసిన మాస్ స్టెప్స్ కు యూత్ ఊగిపోతున్నారు. ఈ క్రమంలో ఆమె చేత ఓ ఐటెం సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఓ క్రేజీ ఫిల్మ్ టీమ్ కు వచ్చిందిట. ఆ క్రేజీ ఫిల్మ్ ఏమిటి...ఇంతకీ శ్రీలీల ఓకే చెప్పిందా..
 
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల తెలుగులో సెటిలైపోయిందనే చెప్పాలి. ఈ  ఒకే ఒక సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ఆ తర్వాత  గతేడాది చివర్లో రవితేజతో చేసిన ‘ధమాకా’ మూవీతో అదిరిపోయే సక్సెస్ ని సొంతం చేసుకొని టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారింది. ఈ సినిమా సక్సెస్‌తో శ్రీలీల వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌‌కు ఓకె చెప్పింది. దాంతో అప్పటికే స్టార్స్ గా హీరోయిన్స్ ని ప్రక్కన పెట్టి నెంబర్ వన్ ప్లేస్ కు వెళ్లింది. అయితే అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న టైమ్ లో  వరుస ఫ్లాపులు ఆమెను స్లో చేశాయి. 

2023 సంవత్సరం ఆమెకు కష్టంగా మారింది. రామ్ హీరోగా   బోయపాటి దర్శకత్వం లో వచ్చిన “స్కంద” చిత్రం సెప్టెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత “భగవంత్ కేసరి” లో బాలయ్యకు కూతురుగా కనిపించింది. ఆ సినిమా సక్సెస్ అయ్యింది.. ఆమె నటనా సామర్థ్యాలకు కూడా ప్రశంసలు అందుకుంది. అయినా గ్లామర్ అప్పీల్ లేకపోవటంతో కెరీర్ పరంగా పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ సరసన చేసిన ఆదికేశవ చిత్రం సైతం డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాకూడా ఆమె కెరీర్ కు పెద్ద మైనస్ గా మారింది.  

ఆ తర్వాత  ఆమె నటించిన  “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్”సక్సెస్ కోసం ఎదురుచూసింది. ఆమె నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది.   “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” కూడా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆమె ఈ సంక్రాంతి కానుకగా  జనవరిలో వచ్చిన గుంటూరు కారంతో పలకరించింది. ఆ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా..కలెక్షన్స్ కుమ్మేస్తోంది.
“వామ్మో అదేమి డ్యాన్స్… అదేమీ ఎనర్జీ” అని ఇటీవల ఆమె డ్యాన్స్ ని ఇంటర్వూలో  మెచ్చుకున్నారు హీరో మహేష్ బాబు. ఈ క్రమంలో  ఒక స్పెషల్ సాంగ్ చేయించాలనే ఐడియా వచ్చిందట ఒక సినిమా టీంకి. ఆ సినిమానే పుష్ప 2. 

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తీస్తున్న “పుష్ప 2” సినిమాలో ఐటెం సాంగ్ ని ఒక బాలీవుడ్ భామతో చేయించాలని భావిస్తోంది టీం. కృతి సనన్, దిశా పటాని వంటి భామల పేర్లను పరీశీలించి, “గుంటూరు కారం”లో ఆమె మాస్ డ్యాన్సులు చూసిన తర్వాత శ్రీలీలతో ఈ ఐటెం సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన దగ్గర ఆగారని తెలుస్తోంది. అల్లు అర్జున్ సినిమా అంటే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తుంది శ్రీలీల. నిజమే అయితే మరోసారి ఊ అంటావా..పాటలాంటిది సూపర్ హిట్టై కూర్చుంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios