యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల కెరీర్‌ రెండేళ్లు తిరక్కుండానే తలక్రిందులు అయ్యింది.ఇప్పుడు ఒక్క ఆఫర్‌ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నది ఒక్కటే హోప్‌..  

టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల ఇప్పుడు ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ఈ అమ్మడు పేరు ఇప్పుడు వినిపించడం తగ్గిపోయింది. మేకర్స్ ఈ బ్యూటీని పట్టించుకోవడం తగ్గించారు. వరుస పరాజయాలతో శ్రీలీల కెరీర్‌ ట్రాక్‌ తప్పింది. కమిట్‌ అయిన సినిమాలు కూడా ఉన్నాయా పోయాయా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆమెకి సంబంధించిన పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. 

శ్రీలీల పవన్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`తోపాటు నితిన్‌తో `రాబినహుడ్‌` చిత్రంలో నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే `ఉస్తాధ్‌ భగత్‌ సింగ్‌` మూవీ షూటింగ్‌ ఇప్పట్లో ప్రారంభం కాదు. మరోవైపు ప్రస్తుతం `రాబిన్‌హుడ్‌` చిత్రీకరణ దశలో ఉంది. కానీ దీనికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దీంతో ఇందులో శ్రీలీల ని పక్కన పెట్టారానే అనే డౌట్స్ స్టార్ట్ అయ్యింది. అయితే వెంకీ కుడుముల రూపొందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

నితిన్‌ `రాబిన్‌హుడ్‌`లో శ్రీలీల ఉందట. ఆమెపై ఇప్పటికే 30శాతం షూటింగ్‌ చేశారట. ఆమె పాత్ర ఉంటుందని, త్వరలోనే ఆమె మళ్లీ షూటింగ్‌లో జాయిన్‌ అవుతున్నట్టు తెలుస్తుంది. శ్రీలీలకి ఈ ఆఫర్‌ ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో `ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌` మూవీ వచ్చింది. అది బోల్తా కొట్టింది. దీంతో దీన్నుంచి శ్రీలీలని తప్పించారనే వార్తల నేపథ్యంలో తాజా వార్త ఆమె అభిమానులకు ఊరటనిస్తుంది. ఆమెకి ఇప్పుడు ఉన్న ఒక్క ఆశ ఇదే. హిట్‌ అయితే కెరీర్‌ గాడిన పడుతుంది, లేదంటే మరింత అయోమయంలో పడుతుంది. మరి ఈ మూవీ ఏం చేస్తుందో చూడాలి. 

అయితే ఇప్పుడు కొత్తగా మరే ఆఫర్‌ రావడం లేదు శ్రీలీలకి. అంతకు ముందు స్టార్‌ హీరోలు, యంగ్‌ హీరోలు ఆమె వెంటపడ్డారు. మేకర్స్ ఆమె ఉంటేనే సినిమా చేస్తామనే డిమాండ్‌ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయ్యింది. శ్రీలీలని పట్టించుకోవడం లేదు. కొత్తగా ఈ బ్యూటీకి ఏ ఆఫర్‌ రాకపోవడమే అందుకు నిదర్శనం. వరుస పరాజయాలు ఈ బ్యూటీ కెరీర్‌ని తలక్రిందులు చేశాయని చెప్పొచ్చు.కేవలం ఆమె డాన్సుల కోసమే మేకర్స్ తీసుకున్నారు. ఆ కిక్‌ కొంత వరకు పరిమితమయ్యింది. నటిగా మెప్పించలేకపోతే ఎవరైనా ఆలోచనలో పడతారు. ఇప్పుడు అదే జరుగుతుందని తెలుస్తుంది. మరి ఇప్పటికైనా శ్రీలీల సెలక్టీవ్‌గా సినిమాలు చేయాలని, మంచి ఆఫర్లు ఎంచుకుని కెరీర్‌ నిర్మించుకోవాలని అభిమానులు కోరుతున్నారు.