లిప్ లాక్ పై శ్రీలీల అబద్దం చెప్పిందా, ఫస్ట్ కిస్ భర్తకే అని చెప్పి ఇలా.. వీడియోతో దొరికిపోయిందిగా, వైరల్
బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.

బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది. శ్రీలీల రీసెంట్ గా భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. శ్రీలీల ప్రస్తుతం భగవంత్ కేసరి ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది.
భగవంత్ కేసరి చిత్రంలో శ్రీలీల నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఇటీవల శ్రీలీల సినిమాల్లో లిప్ కిస్ సన్నివేశంలో నటించడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లిప్ కిస్ సీన్ లో నటించాల్సి వస్తే ఏ హీరోతో నటిస్తారు అని ప్రశ్నించగా .. నేను ఎవ్వరితోనూ లిప్ లాక్ సీన్ లో నటించను అని సమాధానం ఇచింది శ్రీలీల.
తొలి ముద్దు తన భర్తకి మాత్రమే ఇస్తానని పేర్కొంది. ముద్దంటూ పెట్టుకుంటే పెళ్లి తర్వాత భర్తతో మాత్రమే అని చెప్పిన శ్రీలీల అసలు విషయం మరచిపోయి అడ్డంగా దొరికిపోయింది. ఫలితంగా నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. గతంలో శ్రీలీల కన్నడలో కిస్ అనే చిత్రంలో నటించింది. ఆ మూవీలో హీరోతో లవ్ సీన్ లో భాగంగా ఇద్దరూ లిప్ కిస్ పెట్టుకుంటారు.
ఈ సంగతి మరచిపోయిన శ్రీలీల తన భర్తకే ఫస్ట్ కిస్ అని చెప్పడంతో నెటిజన్లు ఆడేసుకుంటుంటారు. ఆ దృశ్యాలు పోస్ట్ చేస్తూ శ్రీలీల ని ఆడేసుకుంటున్నారు. శ్రీలీల అడ్డంగా దొరికిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్,ఆది కేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లాంటి చిత్రాల్లో నటిస్తోంది.