సైఫ్ కొడుకు ఇబ్రహీంతో కనిపించిన శ్రీలీల, సీక్రేట్ గా ఏం చేస్తున్నారు..?

సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీంతో కలిసి కనిపించింది టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల. అసలు అక్కడ ఏం జరుగుతోంది ? 

Sreeleela Bollywood Entry with Saif Ali Khans Son Ibrahim JMS

హీరోయిన్ శ్రీలీల కథే చాలా ఆసక్తికరంగా ఉంది. ఈమె కన్నడ అమ్మాయి. ఇప్పటికే దీపికా పదుకొణె లాంటి కన్నడ అమ్మాయిలు దేశవ్యాప్తంగా నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. దీపికా పదుకొణె ఉడుపి జిల్లాకు చెందిన అమ్మాయి. తన ఊరి పేరుని ఇప్పటికీ ఇంటిపేరుగా పెట్టుకుంది. కానీ బాలీవుడ్ వాళ్ళు పదుకొణె ని పుడుకొన్ అని పిలుస్తున్నారు. ఇక రష్మిక మందన్న కూడా కొడగు అమ్మాయి. ఈమె కూడా ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఈమెకి కన్నడ అంటే కొంచెం అలెర్జీ ఉందేమో అనిపిస్తుంది. అందుకే ఈమె తరచూ ట్రోల్స్ కి గురవుతుంది. ఇప్పుడు శ్రీలీల కూడా బాలీవుడ్ కి వెళ్లబోతోంది. ఎవరు ఏం అడిగినా 'నేను కన్నడ అమ్మాయిని, నాకు కన్నడ వచ్చు, కన్నడ మాట్లాడటం నాకిష్టం' అని చెప్పే శ్రీలీల.. మంచి ఇమేజ్ ను సంపాదించకుంది. 

ఇప్పుడు చెప్పబోయేది ఈ అమ్మాయి కథే. 'పుష్ప 2' సినిమాలో 'కిస్సిక్' పాటతో మరింత పాపులర్ అయ్యింది శ్రీలీల. టాలీవుడ్ కే పరిమితం అయిన ఆమె ఇమేజ్.. ఇప్పుడు ఇ ఐటమ్ సాంగ్ తో పాన్ ఇండియాకు చేరింది. దాంతో బాలీవుడ్ నుంచి కూడా శ్రీలీలకు అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు  వరుస సినిమాలకు కమిట్ అయ్యింది కూడా. అంతే కాదు, పటౌడీ ఖాన్ కుటుంబంలోకి కూడా అడుగుపెట్టబోతోంది. సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో  కలిసి రీసెంట్ గా మీడియా కంట పడింది బ్యూటీ. అయితే  ఈ అమ్మాయికి అతనితో  ఏం పని అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. 

డాక్టర్ కూతురు.. కాబోయే డాక్టర్ అయిన శ్రీలీల సినిమా రంగంలో చాలా ఎత్తుకు ఎదగాలని అనుకుంటుంది. అందుకే  బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు  ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టుంది. 'స్త్రీ 2' సినిమా నిర్మించిన మాడోక్ ఫిల్మ్స్ ఆఫీస్ కి శ్రీలీల వెళ్ళింది. ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం కూడా అక్కడే ఉన్నాడు. శ్రీలీల  కెమెరాలకు పోజులిచ్చింది. చాలా గ్లామరస్ గా కనిపించింది. సైఫ్ కొడుకుతో సినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు శ్రీలీల దగ్గర 5 సినిమాలు ఉన్నాయి. నితిన్ తో 'రాబిన్ హుడ్', పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్', రవితేజ తో 'మాస్ జాతర' సినిమాలు చేస్తోంది.
 

శివ కార్తికేయన్ 25వ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఈమె తమిళంలోకి కూడా అడుగుపెడుతోంది. ఈ సినిమాకి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. జనార్ధన్ రెడ్డి కొడుకు నిఖిల్ తో కూడా కన్నడ సినిమా చేస్తోందట శ్రీలీల. బాలీవుడ్ ఎంట్రీతో ఈ అమ్మాయి అదృష్టం మారిపోయే అవకాశం ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios