Asianet News TeluguAsianet News Telugu

Sreeleela:పాపం శ్రీలీలకి దిష్టి తగిలిందేమో.. ఇక భారం మొత్తం మహేష్ బాబు పైనే.. 

శ్రీలీలకి దిష్టి తగిలిందో ఏమో.. ఎంత వేగంగా ఆమెకి అవకాశాలు వచ్చాయో అంతే వేగంగా ఫ్లాపులు ఎదురవుతున్నాయి.

Sreeleela all hopes on Mahesh babu gunturu kaaram movie dtr
Author
First Published Dec 8, 2023, 4:05 PM IST

పెళ్లి సందD చిత్రంతో శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది. ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు. ఇటీవల కాలంలో చూసుకుంటే దాదాపు ప్రతి నెలలో ఆమె నటించిన సినిమా రిలీజ్ అవుతూనే ఉంది. దీనితో ఆమెపై హీరోలు సైతం సెటైర్లు వేస్తున్నారు. 

శ్రీలీలకి దిష్టి తగిలిందో ఏమో.. ఎంత వేగంగా ఆమెకి అవకాశాలు వచ్చాయో అంతే వేగంగా ఫ్లాపులు ఎదురవుతున్నాయి. రామ్ సరసన నటించిన స్కంద చిత్రం దారుణంగా డిజాస్టర్ గా నిలిచింది. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన నటించిన ఆదికేశవ చిత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కనీసం మంచి బజ్ అందుకున్న నితిన్ ఎక్స్ట్రా చిత్రంతో ఆయినా శ్రీలీల గట్టెక్కుతుందని భావించారు. 

నేడు విడుదలైన ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ చిత్రానికి కూడా టాక్ సోసో గానే ఉంది. క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి.ఈ మూవీలో శ్రీలీల పాత్రకి అంతగా ప్రాధాన్యత కూడా లేదట. దీనితో శ్రీలీల నటించే చిత్రాలు వర్కౌట్ కావడం లేదు అనే కామెంట్స్ మొదలయ్యాయి. మధ్యలో వచ్చిన భగవంత్ కేసరి మాత్రం హిట్ కొట్టింది. కానీ అందులో ఆమెది హీరోయిన్ పాత్ర కాదు. 

దీనితో ఇక శ్రీలీల కాపాడే భారం మొత్తం మహేష్ బాబుదే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల మహేష్ బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ మూవీ హిట్ అయితే ఇటీవలఎదురైన ఫ్లాపులన్నీ శ్రీలీల మరచిపోవచ్చు. మరి మహేష్ బాబు ఆదుకుంటాడో లేదో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios