కళ్యాణ్ దేవ్ వరుస సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఆయన అభిమానులకు, సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారనే సందేహాలు కలుగుతున్నాయి.
కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ వేదిక తన మనసులోని మాటలు పంచుకుంటున్నారు.ఆయన వరుస పోస్ట్స్ కాకరేపుతున్నాయి. ఒకరి సమస్య గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. కాబట్టి విషయం తెలియకుండా మాట్లాడకూడదు అని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టాడు. తాజాగా మరొక పోస్ట్ పెట్టారు. రెండు రకాల బాధలు ఉంటాయి. వాటిలో మనం ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుందని అన్నారు. క్రమశిక్షణ వలన వచ్చే బాధ లేదా విచారం వలన వచ్చే బాధ ఉంటాయి. ఈ రెంటిలో ఒకటి ఎంచుకోవాలి. మీరు ఏది కోరుకుంటారని ఆయన ప్రశ్నించారు. శ్రీజాతో ఆయన విడిపోయిన నేపథ్యంలో ఆయన పోస్ట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కళ్యాణ్ దేవ్ భార్య శ్రీజాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అధికారికంగా విడాకులు ప్రకటించనుకున్నప్పటికీ విడిపోయారన్న మాట వాస్తవమేనని, విశ్వసనీయ వర్గాల సమచారం. ఈ వాదన బలపరిచే విధంగా పరిస్థితులు ఉన్నాయి. శ్రీజ-కళ్యాణ్ దేవ్ కలిసి కనిపించి ఏడాది దాటిపోయింది. ఇక వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్స్ విడాకుల మేటర్ ధృవీకరిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ కూతురు నవిష్క శ్రీజా వద్దే పెరుగుతుంది. ఈ క్రమంలో కూతురుని తలచుకుని కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్స్ పెడుతుంటారు. ఆమెను బాగా మిస్ అయిన భావన వ్యక్తీకరిస్తుంటారు.

కాగా 2016లో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకున్నారు. శ్రీజకు ఇది రెండో వివాహం. చిరంజీవి అల్లుడి హోదాలో కళ్యాణ్ దేవ్ హీరోగా మారాడు. ఆయన మొదటి చిత్రం విజేత ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. అనంతరం సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో కళ్యాణ్ దేవ్ నటించారు.
