మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి వివాహం గురించి అందరికీ తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది.

అయితే ఇద్దరి మధ్య కొన్ని విబేధాల కారణంగా విడిపోయారు. కొంతకాలం తరువాత శ్రీజ.. కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకొంది. అయితే అప్పటినుండి ఆమె మొదటి భర్త గురించి ఎక్కడా టాపిక్ లేదు. అతడు ఏం చేస్తున్నాడు..? ఎక్కడున్నాడనే ఇన్ఫర్మేషన్ కూడా లేదు.

అయితే తాజాగా శిరీష్ సోషల్ మీడియాలో తన గర్ల్ ఫ్రెండ్ ఫోటోలను షేర్ చేశాడు. ఆ పోస్ట్ లో ఆమెని పెళ్లి చేసుకున్నట్లు ఏమీ వెల్లడించలేదు కానీ నెటిజన్లు మాత్రం హ్యాపీ మేరీడ్ లైఫ్ అంటూ విషెస్ చెబుతున్నారు.

కొంతమంది మంది కొత్త జీవితాన్ని ఆరంభించినందుకు సంతోషమని ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో శిరీష్ కి పెళ్లైందనే అనుమానాలు కలుగుతున్నాయి.