నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా  వీరభోగ వసంత రాయలు. ఇంద్రసేన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చిత్రం మొదలైనప్పటి నుంచి ఫస్ట్ లుక్స్ తోనే అంచనాలు పెరిగాయి. కొత్తగా ఉండటంతో తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని అనుకున్నారు. 

కానీ సినిమా విడుదల తరువాత సినిమా జనల వద్దకు అంతగా రీచ్ కాలేకపోయింది. అదే విధంగా రివ్యూలు కూడా నెగిటివ్ గా వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ రివ్యూలు ఇచ్చినవారిపై సెటైర్స్ వేసేవిధంగా ఫెక్ రివ్యూస్ అంటూ.. థియేటర్లో సినిమాను ఆస్వాదించడండి అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. దర్శకుడు ఇంద్రసేన కూడా మిడిల్ ఫింగర్ చూపిస్తూ గట్టిగానే తన ఆగ్రహాన్ని రివ్యూస్ పై వ్యక్తం చేశాడు. 

అయితే వీటితో తనకు ఏ మాత్రం సంబంధం లేదని అంటున్నాడు సినిమాలో నటించిన శ్రీ విష్ణు.  రివ్యూయర్స్ ను తాను ఎప్పటికి గౌరవిస్తానని త్వరలోనే నేను ఒక సినిమాతో మీ ముందుకు రాబోతున్న.. తప్పకుండా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అలాగే చిత్ర యూనిట్ నుంచి వచ్చిన ఆ పోస్టర్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీ విష్ణు క్లారిటీ ఇవ్వడంతోసోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.