Asianet News TeluguAsianet News Telugu

అల్లూరి సినిమాకు ఆర్థిక కష్టాలు.. ఆగిపోయిన సినిమా రిలీజ్..?

అల్లూరి సినిమాను ఆర్టిక కష్టాలు వెంటాడుతున్నాయి. దాంతో రిలీజ్ కూడా కష్టం అయ్యింది. ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన సినిమా రిలీజ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది..?
 

Sree Vishnu Alluri Movie Release Up Date
Author
First Published Sep 23, 2022, 2:44 PM IST

అల్లూరి సినిమాను ఆర్టిక కష్టాలు వెంటాడుతున్నాయి. దాంతో రిలీజ్ కూడా కష్టం అయ్యింది. ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన సినిమా రిలీజ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది..?

చాలా కాలంగా యంగ్ హీరో  శ్రీవిష్ణుకు సరైన హిట్స్ లేవు.రీసెంట్ గా వచ్చిన భళా తందనాన సినిమా కూడా ఫెయిల్యూర్ బాట పట్టడంతో.. నెక్ట్స్ సినిమాల విషయంలో కాస్త జాగ్రత్త పాటించాలి అనుకున్నాడు శ్రీవిష్ణు. ఇక  ఆ సినిమా తరువా శ్రీవిష్ణు చేసిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అల్లూరి. ఈ సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు శ్రీవిష్ణు. కాని ఈసినిమా రిలీజ్ అవ్వడమే అగమ్య గోచరం అయ్యేట్టు కనిపిస్తోంది. 

తన ఫార్ములాకు భిన్నంగా శ్రీ విష్ణు ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ చేశాడు ఈసినిమాలో ...ఈ సినిమా క్లిక్ అయితే అటు సక్సెస్ రావడమే కాదు, ఇటు మాస్-యాక్షన్ హీరోగా కూడా సెటిలైపోవచ్చు అనుకున్నాడు. అందుకే  అందుకే శ్రీవిష్ణు ఈసారి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అడుగులు వేస్తున్నాడు. కాని ఈసినిమాకు ఆర్ధికంగా దెబ్బ తప్పలేదు. ఈరోజు (23 సెప్టెంబర్ ) రిలీజ్ కావల్సి సినిమా మార్నింగ్ షో వరకూ రిలీజ్ అవ్వలేదు. దాంతో ఈమూవీ రిలీజ్ ఆగిపోయినట్టే తెలుస్తోంది. 

సినిమాకు సబంధించి డబ్బులు బాకీ ఉంటే ఫైనాన్సియర్స్ సినిమాను అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్మాత ముందడుగు వేసి వారితో డీల్ చేసుకోవాలి కాని ఈసినిమా నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఈ విషయంలో ఇంకా సెటిల్ చేసుకోలేదనే టాక్ వినిపిస్తోంది. మరి ఈమూవీ రిలీజ్ పై ఎలాంటి నిర్ణయంవస్తుందో చూడాలి. 

నిజానికి ఈ సినిమా మొన్నటివరకు ఆర్థిక కష్టాలు చవిచూసింది. స్వయంగా శ్రీవిష్ణు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తో కలిసి రంగంలోకి దిగి, తనకు తెలిసిన వాళ్లతో మాట్లాడి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడు. అలా సినిమాకు లైన్ క్లియర్  అయ్యింది అనుకున్నారు. కాని రిలీజ్ టైమ్ కు మళ్ళీ ఆర్దిక కష్టాలు రావడంతో.. సినిమా రిలీజ్ అవ్వలేదని తెలుస్తోంది. మరి చూడాలి ఈసినిమా రిలీజ్ అవుతుందో లేదో..?

Follow Us:
Download App:
  • android
  • ios