Asianet News TeluguAsianet News Telugu

శ్రావణ భార్గవి రెండో పెళ్లి రూమర్స్, ఆ ఫోటోలు నిజమేనా.. విడాకులు ఎప్పుడు తీసుకుంది ?

టాలీవుడ్ లో సింగర్ గా శ్రావణ భార్గవి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.శ్రావణ భార్గవి కెరీర్ ఆరంభంలో బిల్లా, సింహా, ఖలేజా లాంటి చిత్రాల్లో పాటలు పాడి పాపులర్ అయింది.

Sravana Bhargavi second marriage rumours goes viral dtr
Author
First Published Sep 17, 2023, 11:24 AM IST

టాలీవుడ్ లో సింగర్ గా శ్రావణ భార్గవి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.శ్రావణ భార్గవి కెరీర్ ఆరంభంలో బిల్లా, సింహా, ఖలేజా లాంటి చిత్రాల్లో పాటలు పాడి పాపులర్ అయింది. కీరవాణి, తమన్, దేవిశ్రీ ప్రసాద్ ఇలా ప్రముఖ సంగీత దర్శకుల చిత్రాల్లో పాటలు పాడింది. 

అయితే తరచుగా శ్రావణ భార్గవి వివాదాలతో వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆ మధ్యన అన్నయ్య కీర్తనలని కించపరిచే విధంగా వ్యవరించింది అంటూ శ్రావణ భార్గవిపై హిందూ సంఘాలు.. అన్నయ్య కుటుంబీకులు మండిపడ్డారు. 

శ్రావణ భార్గవి కేవలం సింగర్ గా మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది. కెరీర్ జోరుమీద సాగుతున్న తరుణంలో శ్రావణ భార్గవి తన కో సింగర్ హేమ చంద్రని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప సంతానం. అయితే కొంతకాలంగా హేమ చంద్ర.. శ్రావణ భార్గవి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే తాము కలిసే ఉన్నాం అంటూ రూమర్స్ ని ఖండించారు. పైకి అలా చెబుతున్నా ఇద్దరూ విడిగానే ఉంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 

Sravana Bhargavi second marriage rumours goes viral dtr

ఈ ఊహాగానాలని మరింత పెంచే విధంగా శ్రావణ భార్గవి రెండవ వివాహానికి సిద్ధం అవుతోంది అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. ఆమె హల్దీ వేడుక కూడా జరిగింది అంటూ కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. దీనితో నెటిజన్లు అంతా షాక్ అవుతున్నారు. హేమ చంద్ర నుంచి శ్రావణ భార్గవి ఎప్పుడు విడిపోయింది.. అసలు విడాకులు ఎప్పుడు తీసుకున్నారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే శ్రావణ భార్గవి, హేమ చంద్ర మధ్య రిలేషన్ ఎలా ఉన్నా ఆమె రెండవ పెళ్లి విషయంలో ఎలాంటి వాస్తవం లేదు అని అంటున్నారు. ఎందుకంటే వైరల్ అవుతున్న ఫొటోస్ రెండేళ్ల క్రితంవి. ఆ ఫోటోలు శ్రావణ భార్గవి సోదరుడు హరీష్ హల్దీ వేడుకకి సంబందించినవి అని అంటున్నారు. దీనితో శ్రావణ భార్గవి రెండో వివాహం చేసుకుంటోంది అనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని తేలిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios