శ్రద్ధగా అందాలు ఆరబోస్తూ..!

sraddha das hot pics
Highlights

'సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది నటి శ్రద్ధాదాస్

'సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది నటి శ్రద్ధాదాస్. తెలుగులో ఆర్య2. డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రాలేదని చెప్పాలి. తమిళ, హిందీ చిత్రాల్లో అడపాదడపా పాత్రలో చేస్తూ ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ 'శృంగార దాన్' అనే షార్ట్ ఫిల్మ్ లో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించాబోతుందని తెలుస్తోంది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ దీపక్ పాండే ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 90ల కాలం నాటి వాస్తవ జీవితాల ఆధారంగా ఈ లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఒక వేశ్య మధ్య వయస్కుడైన ఒక వ్యక్తిని ప్రేమించే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇందులో శ్రద్ధా లుక్ ఎలా ఉండబోతుందో అభిమానులతో పంచుకుంది ఈ బ్యూటీ. ''మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అద్భుతమైన పాత్రలో నటిస్తున్నాను. ఆ పాత్ర ఎలా ఉండబోతుందో ఊహించుకోండి. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రను చేస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ'' ఓ ఫోటోను షేర్ చేసింది శ్రద్ధా.


 

loader