టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హిరోయిన్ శ్ర‌ద్దా దాస్ డిక్టేట‌ర్ మూవీ షూటింగ్ అప్పుడు బాల‌య్యతో పుల్ ఎంజాయ్ చేసిన శ్ర‌ద్దా బాలాకృస్ణ త‌న ఫేవ‌రేట్ హిరో అంటు పొగిడేస్తున్న బెంగాల్ బ్యూటి
'బాలయ్య ఆన్ స్క్రీన్ పై పులిలా కనిపిస్తారు. ఆయన చెప్పే డైలాగ్స్ నిజంగా గర్జిస్తున్నట్లుగానే ఉంటాయి. సింహం స్క్రీన్ పై కనిపిస్తోందా అనిపించక మానదు. అయితే ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఆయన చాలా కూల్. బాలకృష్ణ వందో చిత్రంగా వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి' సూపర్ హిట్ కావాలని ఆశిస్తున్నా అంటున్న శ్రద్ధా దాస్.. తాను డిక్టేటర్ తో బాలయ్యతో కలిసి పని చేసినప్పుడు బోలెడంత ఎంజాయ్ చేశానని చెబుతోంది.
అయితే.. ఎనర్జీ లెవెల్స్ చూపించడంలో మాత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా అన్న శ్రద్ధాదాస్.. హ్యాండ్సమ్ యాక్టర్ అయితే మాత్రం మహేష్ బాబే అనేసింది. గుంటూర్ టాకీస్ తర్వాత ప్రవీణ్ సత్తారుతో మరో సినిమా చేస్తున్న ఈ బెంగాలీ భామ.. ఆ సినిమాలో జర్నలిస్ట్ గా తన ట్యాలెంట్ చూపిస్తానని చెబుతోంది.
