Asianet News TeluguAsianet News Telugu

‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

 రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం పెద్ద స్థాయిలోనే ఈ సినిమాను రిలీజ్ చేశారు. మార్నింగ్ షోలు చాలా చోట్ల ఫుల్ అయ్యాయి. థియేటర్లలో మంచి హడావిడి కనిపించింది. సీనియర్ నటుడు సాయికుమార్ – తులసి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.

SR Kalyana Mandapam 2 Days Colections
Author
Hyderabad, First Published Aug 8, 2021, 2:26 PM IST

కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఇటీవలే రీఓపెన్ అయిన విషయం తెలిసిందే. థియేటర్స్ తెరుచుకున్న తర్వాత శుక్రవారం ఎక్కువ సినిమాలు విడుదలయ్యాయి. 5 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా మంచి టాక్ తో పాటు చెప్పుకోదగ్గ వసూళ్లను కూడా రాబడుతుంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం పెద్ద స్థాయిలోనే ఈ సినిమాను రిలీజ్ చేశారు. మార్నింగ్ షోలు చాలా చోట్ల ఫుల్ అయ్యాయి. థియేటర్లలో మంచి హడావిడి కనిపించింది. సీనియర్ నటుడు సాయికుమార్ – తులసి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తోడు ఈ సినిమా టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించటం కలిసొచ్చింది.  మొదటి రోజే కాదు రెండో రోజు శనివారం కూడా ఈ సినిమా స్టడీగానే బాగున్నాయి కలెక్షన్స్ . అక్కడక్కడా కొద్దిగా డ్రాప్ కనపడినా , కంగారుపడాల్సిన స్దాయిలో లేదని ట్రేడ్ వర్గాల సమాచారం. 

  ఈ చిత్రం రెండు రోజులు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ... గ్రాస్ ...షేర్ ..ఏరియాల వారిగా 
నైజాం: 1.85కోట్లు(1.14కోట్లు)
సీడెడ్: 78లక్షలు (53లక్షలు)
ఉత్తరాంధ్ర: 54లక్షలు(28లక్షలు)
ఈస్ట్ గోదావరి: 26లక్షలు(16లక్షలు)
వెస్ట్ గోదావరి: 20లక్షలు(13లక్షలు)
గుంటూరు:38లక్షలు(23లక్షలు)
కృష్ణా: 21లక్షలు(12లక్షలు)
నెల్లూరు: 14లక్షలు(7లక్షలు)
మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి: 4.36కోట్లు(2.66కోట్లు షేర్)
కర్ణాటక+ఇండియాలో మిగతా  ప్రాంతాలు: 18లక్షలు( 9లక్షలు)
ఓవర్ సీస్: 34లక్షలు(14లక్షలు)
టోటల్ కలెక్షన్స్ : 4.88కోట్లు( 2.89కోట్లుషేర్) 

అయితే మొదటి రోజు కనిపించిన ఊపు ముందుకు సాగే కొద్దీ తగ్గుతోంది. ఈ వీకెండ్ ప్రక్కన పెడితే సోమవారం నుంచి అసలైన పరీక్ష. చిత్రం విషయానికి వస్తే  సాధారణమైన కథ.. రొటీన్ స్క్రీన్ ప్లే.. అంతే సాదా సీదా సన్నివేశాలు సినిమా గ్రాఫ్‌ను పడేసాయి. ఫస్టాఫ్‌లో ఎంటర్టైన్మెంట్ వర్కవుట్ అయినా.. ముందుకు సాగే కొద్దీ సినిమా సెంటిమెంట్ తో నీరసం తెప్పించింది ప్రేక్షకులకు. ప్రి క్లైమాక్స్‌లో తండ్రీ-కొడుకుల బంధం నేపథ్యంలో ఎమోషన్ పిండటానికి ప్రయత్నించారు. అయినా ఓ వర్గానికి ఈ సినిమా బాగానే కిక్ ఇస్తోంది. చూడాలి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఫైనల్ గా ఎంత రాబట్టుతుందో.   

Follow Us:
Download App:
  • android
  • ios