స్పైడర్ మూవీతో తమిళనాడులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ బాబు స్పైడర్ ఆడియో వేడుకలో గెస్టులుగా శంకర్, రాజమౌళి మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరవుతారని ప్రచారం
సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళంలో ఆరంగేట్రం చేస్తున్న స్పైడర్ మూవీ ఇప్పటికే తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ చిత్రం తమిళంలో ఇప్పటికే క్రేజ్ సంపాదించినా... మహేష్ బాబును తమిళ ఆడియెన్స్ కు పరిచయం చేయటానికి ఓ స్టార్ అవసరం తప్పని సరి. గతంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పైడర్ టీమ్ తమిళనాడులో నిర్వహించే వేడుకకు హాజరవుతారని రూమర్స్ జోరుగా వినిపించాయి.
తాజాగా గెస్ట్ లిస్ట్ లో మరో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. బాహుబలి దర్శకుడు రాజమౌళి, రోబో దర్శకుడు శంకర్ లు మహేష్ బాబు స్పైడర్ ఆడియో లాంచ్ ఈవెంట్ కు హాజరవుతారని తెలుస్తోంది. అయితే అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.
మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో స్పైడర్ ముందు వరుసలో వుండటం విశేషం.
