‘మా ఊరి పొలిమేర 2’ చేతబడి కథతో సినిమా. ‘మా ఊరి పొలిమేర 1’ ఓటీటీలో విడుదలై హిట్టవడంతో, ‘2’ కూడా తీస్తే హిట్టయ్యింది
ఒకప్పుడు అసాధారణ కథలతో ఔటాఫ్ బాక్స్ సినిమాలు తీయడానికి భయపడ్డ నిర్మాతలు ఓటీటి పుణ్యమా అని కొత్త కాన్సెప్టు సినిమాలతో ముందుకు వస్తున్నారు. వీటికి పెద్ద బడ్జెట్ అక్కర్లేదు. స్టార్స్ అక్కర్లేదు. ఆ మధ్యన హారర్ కామెడీలు హవా నడిచినట్లుగానే ..ఇప్పుడు చేతబడి, దెయ్యం సినిమాల కథలకు ప్రయారిటీ ఇస్తున్నారు. మూస ఫార్ములాకి భిన్నంగా ఇవి రియలిస్టిక్ జానర్ కావడంతో మార్పుని కోరుకుంటున్న ప్రేక్షకులు దీన్ని హిట్ చేశారు. ఈ సినిమాల రిజల్టు బాగుండటటంతో ప్రేక్షకుల గ్రీన్ సిగ్నల్ లభించినట్టే భావించి మరిన్ని రావటానికి రంగం సిద్దమవుతోంది. ఈసినిమాల రెవిన్యూ తెలుగులో 2023లో వంద కోట్లు దాటింది అంటే నమ్మలేని నిజం.
ఈ క్రమంలో మసూద, విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2, పిండం, మంగళవారం సినిమాలు వచ్చాయి. ‘మా ఊరి పొలిమేర 2’ చేతబడి కథతో సినిమా. ‘మా ఊరి పొలిమేర 1’ ఓటీటీలో విడుదలై హిట్టవడంతో, ‘2’ కూడా తీస్తే హిట్టయ్యింది. దీనికి దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ‘మసూద’, ‘విరూపాక్ష’ చేతబడి సినిమాలని హిట్ చేసిన ప్రేక్షకులు ఈ సినిమానీ హిట్ చేశారు. రూరల్ థ్రిల్లర్స్ గా ఇవి పరిగణింపబడుతున్నాయి. చేతబడి సినిమాలు, గ్రామదేవతల సినిమాలు హిట్టవుతున్నాయి. దెయ్యాలతో హార్రర్ కామెడీ సినిమాలు పాతబడిపోయిన చోట ఇలాటివి సక్సెస్ అవుతున్నాయి. ఫియర్ ఫ్యాక్టర్ ఎప్పుడూ వర్కౌటయ్యే ఫార్ములా అని అంటున్నారు విశ్లేషకులు. కాకపోతే జానర్ మార్చి కొట్టాలి. ఇదే జరిగింది మసూద, విరూపాక్ష, ‘మా ఊరి పొలిమేర’ రెండు భాగాలతో.
ఇవన్నీ ఔటాఫ్ బాక్సు ఫిల్మ్ లే, దెయ్యాలకి బదులు చేతబడి ప్రేక్షకులకి కొత్తదనాన్ని అందించి హిట్టయ్యాయి. ఇక ‘మంగళవారం’. ఇది కూడా ఔటాఫ్ బాక్సే. బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. కాకపోతే ఓవర్ బడ్జెట్ ని అందుకోలేక ఆగిపోయింది అజయ్ భూపతి దర్శకత్వంలో ట్రెండింగ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ నటించిన ఈ మూవీ నింఫోమేనియాక్ పాత్ర కథ. ఇలాటిది తెలుగులో ఇంతవరకూ రాలేదు. దీనికి గ్రామదేవత కథ జోడించారు.
అలాగే ‘కాంతారా’ హిట్టయినప్పట్నుంచీ గ్రామ దేవతలు సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. దీన్ని లాజికల్ సస్పెన్సు తో క్రైమ్ థ్రిల్లర్ గా బాగానే తీస్తున్నారు. రివ్యూలు కూడా ప్రోత్సాహకరంగా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఎంత కలెక్ట్ చేసినా....ఔటాఫ్ బాక్సుకి ఇంత బడ్జెట్ అవసరం లేని సినిమాలు చేయకూడదని మంగళవారం వంటి సినిమాలు పాఠాలు చెప్తున్నాయి.
