ఈ రెండు టైటిల్స్ లో ఏది ఫైనల్?

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు తుది దశకు చేరుకోవడంతో.. ఇప్పుడీ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర టీమ్ సిద్ధమైంది. ఈ వారంలోనే పట్టాలెక్కనుందని సమాచారం. 

Speculation on Akhil,Surendra Reddy movie title jsp

అక్కినేని అఖిల్‌ తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘సైరా’తో ఇటీవల హిట్‌ అందుకున్న దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.  అనిల్‌ సుంకర ప్రాజెక్టును నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు తుది దశకు చేరుకోవడంతో.. ఇప్పుడీ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర టీమ్ సిద్ధమైంది. ఈ వారంలోనే పట్టాలెక్కనుందని సమాచారం. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ వేదికగా ‘ఏఎస్‌ లోడింగ్‌’ అంటూ ఓ హింట్‌ ఇచ్చేసింది. అలాగే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ,టైటిల్ రేపే విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టైటిల్ పై రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

మీడియాలో ప్రచారం అవుతున్న  సమాచారం మేరకు ఈ సినిమాకు  ‘ఏజెంట్’ అనిగానీ,  ‘వారసడు’ అనే టైటిల్ గానీ ఖరారు చేస్తారు. అయితే అవి కేవలం స్పెక్యులేషన్సే. చిత్ర దర్శకుడు, హీరో మనస్సులో ఏ టైటిల్ ఉందో తెలియదు. ఓ విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఈ సినిమా కోసమే అఖిల్‌ తన లుక్‌ని కూడా మార్చుకున్నారు. దీంట్లో అఖిల్ కండలు తిరిగిన బాడీతో మునుపెన్నడూ చూడని విధంగా కొత్తగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

అఖిల్ మాట్లాడుతూ...‘ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. త్వరలో షూటింగ్‌ ఆరంభించడానికి సిద్ధమౌతున్నా. ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. ‘ఈ బ్లాక్‌బస్టర్‌ను రూపొందించాలని చాలా ఉత్సుకతగా ఉంది. ఈ కాంబినేషన్‌ ప్రతి ఒక్కరి అంచనాల్ని అధిగమిస్తుంది. మనకు ఆల్‌ ది వెరీ బెస్ట్‌’ అని అనిల్‌ సుంకర ఆనందం వ్యక్తం చేశారు. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రం తర్వాత అఖిల్‌ అక్కినేని నటించనున్న కొత్త చిత్రం ఇది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios