సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రిప్ లో ఉన్న మహేష్ బాబు త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో పాల్గొనున్నాడు. దర్శకుడు అనీల్ రావిపూడి తనదైన స్టైల్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమాలో ట్రైన్ కామెడీ ఎపిసోడ్ ఒకటి ఉందట. దానికోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కాశ్మీర్ లో మిలిటరీ దళంలో పనిచేసే హీరో.. అంధ్రకు ట్రైన్ లో బయలుదేరతాడట. ఆ సందర్భంగా కొన్ని కామెడీ సీన్లు ఉంటాయని సమాచారం. కాశ్మీర్ నుండి ఆంధ్ర ట్రైన్ జర్నీ అంటే చాలా టైం పడుతుంది.

అందుకే సినిమా తొలిసగంలో ఈ ట్రైన్ ఎపిసోడ్ కాస్త లెంగ్తీగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో మహేష్ తో పాటు హీరోయిన్ రష్మిక, బండ్ల గణేష్, రాజేంద్రప్రసాద్ అలానే మరికొంతమంది కమెడియన్లు కనిపిస్తారట. ఈ ట్రైన్ ఎపిసోడ్ కోసం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ఏకంగా ఓ రైలు సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువ రోజులు షూటింగ్ ఉంటుంది కాబట్టి సెట్ వేయాల్సి వస్తుందని చెబుతున్నారు. దీనికోసం భారీగా ఖర్చు చేస్తున్నారట. ఆగస్ట్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి వచ్చే  ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.