టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు సీనియర్ హీరోల సరసన కనిపించడానికి కూడా రెడీ అవుతోంది. అరవై ఏళ్ల వయసు గల నాగార్జునతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి రెడీ అయింది.

సీనియర్ హీరో సరసన నటిస్తే కుర్ర హీరోలు ఛాన్స్ ఇస్తారా..? లేదా..? అనే విషయాన్ని పట్టించుకోకుండా కథ నచ్చడంతో 'మన్మథుడు 2' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉంటుందట.

అయితే టీజర్ లో మాత్రం రకుల్ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. అయితే దర్శకుడి ఆలోచన మాత్రం మరో విధంగా ఉంది. టీజర్ లో కొన్ని క్షణాలు రకుల్ ని చూపించి వదిలేస్తే ఆమెకి జస్టిఫికేషన్ జరగడం, ఆమె కోసం ప్రత్యేకంగా ఒక టీజర్ ని కట్ చేస్తున్నట్లు దర్శకుడు రాహుల్ తెలిపారు. 

గతంలో 'రంగస్థలం' సినిమా విషయంలో సుకుమార్ కూడా ఇలానే చేశాడు. సమంత పాత్రను ప్రత్యేకంగా పరిచయం చేస్తూ స్పెషల్ టీజర్ వదిలారు. ఇప్పుడు రకుల్ కి కూడా అలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ దక్కుతోంది. అయితే ఈ టీజర్ రావడానికి మరో మూడు వారాలు వేచి చూడక తప్పదు.