ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాకు సగం క్రేజ్ తేవడం కామన్ గా వస్తోంది. అందరూ స్పెషల్ గెస్ట్ లను పిలిచి సినిమాపై హైప్ బాగానే క్రియేట్ చేస్తున్నారు. సినిమా రిజల్ట్ తరువాత సంగతి. ముందు సినిమాకు ప్రమోషన్స్ బజ్ ఏ రేంజ్ లో చేశామన్నదే ముఖ్యం. 

ఇక మజిలీ సినిమా ఈవెంట్ కోసం వెంకటేష్ ముఖ్య అతిధిగా రానున్నట్లు తెలుస్తోంది. సమంత - నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 30న నిర్వహించనున్నారు.

ఆ స్పెషల్ ఈవెంట్ కి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా కూతురు పెళ్లి చేసిన వెంకీ ఇక తన రెగ్యులర్ సినీ లైఫ్ లోకి రావడానికి సిద్దమవుతున్నాడు. వెంకీ మామ సినిమా ద్వారా ఓ వైపు నాగ చైతన్యతో మల్టీస్టారర్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మజిలీ కోసం వచ్చే వెంకీ ఆ సినిమాకు ఏ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తారో చూడాలి.