సౌత్ ఇండస్ట్రీలో నవమన్మథుడు అనే పేరుకు రూపం నాగార్జున అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కొత్తగా ఎవరైనా చూస్తే 30 ఏళ్ల కుర్రాడా అని అనుకోకుండా ఉండలేరు. అంతలా ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తోన్న నాగ్ వయసుతో సంబందం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. 

ఇక ఈ కింగ్ మరికొన్ని రోజుల్లో 60లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆగస్ట్ 29న నాగ్ పుట్టినరోజు కావడంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనీ అక్కినేని అభిమానుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. దీంతో అక్కినేని వారు స్పెషల్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ వేడుకలో మన్మథుడు 2కి ని కూడా యాడ్ చేయాలనీ అనుకుంటున్నారట. 

ఆగస్ట్ 9న మన్మథుడు 2 రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను నాగ్ బర్త్ డే ఈవెంట్ లో మిక్స్ చేయాలనీ ప్లాన్స్ జరుగుతున్నాయట. గత కొన్నాళ్లుగా సక్సెస్ లేక సతమతమవుతున్న నాగ్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.