నెల్లూరు గల ప్రభుత్వ సంగీత మరియు నృత్య పాఠశాలకు లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యం పేరు పెడుతున్నట్లు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేసిన ఎస్పీ చరణ్, ముఖ్యమంత్రి జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. 

గానగంధర్వుడుగా పేరు గాంచిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25న కన్నుమూశారు. తెలుగు వాడైన బాల సుబ్రహ్మణ్యం తన పాటలతో పరిశ్రమకు ఎంతో కీర్తి తెచ్చిపెట్టారు. దశాబ్దాల పాటు సేవలు అందించిన బాల సుబ్రహ్మణ్యం గారికి భారతరత్న ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని వై ఎస్ జగన్ కోరడం జరిగింది. కాగా బాల సుబ్రహ్మణ్యం గారి పేరును నెల్లూరులో గల ప్రభుత్వ మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ కి పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ గా నామకరణం చేయడం జరిగింది. ఏపీ ప్రభుత్వం తన తండ్రికి ఇచ్చిన గౌరవానికి ఎస్పీ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. 

అలాగే మైసూర్ యూనివర్సిటీలో ఎస్పీ బాలసుబ్రమణ్యం అధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేయనున్నారు. యూనివర్సటీ వైస్ ఛాన్సలర్ హేమంత్ కుమార్ కమిటీతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ బాలు పాటల పరిరక్షణ మరియు అధ్యనం కోసం రూ. 5 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.