గానగంధ్వరుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మూడు వారలకు పైగా ఆసుపత్రి బెడ్ పై కరోనాతో పోరాటం చేస్తున్నారు. ఆగస్టు 5న తనకు కరోనా సోకిందని, ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నట్లు ఎస్పీ బాలు తెలియజేశారు.  ఆసుపత్రిలో చేరిన వారం రోజులలో ఆరోగ్యం క్షీణించింది. బాలును సాధారణ గది నుండి ఐసీయూ కి తరలించారు. అప్పటి నుండి బాలు ఆరోగ్యంపై అందరిలోనూ భయాందోళను మొదలయ్యాయి. బాలు గారికి ఏమవుతుందో అన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. 

బాలుగారి ఆరోగ్యంపై ప్రతిరోజూ ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సమాచారం ఇస్తున్నారు. ఐసీయూలో జాయిన్ చేశాక బాలు ఆరోగ్యం చాలా క్రిటికల్ గా ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. బాలు ఆరోగ్యంపై వస్తున్న అప్డేట్స్ మరింత భయాందోళనకు గురిచేశాయి. విదేశీ వైద్యుల బృందం కూడా బాలు కొరకు రావడం జరిగింది. కాగా ఎంజిఎం డాక్టర్స్ కృషితో బాలు ఆరోగ్యం మెరుగవుతున్నట్లు చరణ్ చెప్పుకొస్తున్నారు. 

బాలు వైద్యానికి స్పందిస్తున్నట్లు, డాక్టర్స్ మరియు కుటుంబ సభ్యులను గుర్తుపడుతున్నట్లు చెప్పారు. తాజా అప్డేట్ లో బాలు పాడడానికి కూడా ట్రై చేశారని చెప్పారు. దీనితో బాలు  ఆసుపత్రిలో జాయిన్ అయ్యేటప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకోనున్నాడని అందరూ అంటున్నారు. కరోనా సోకిన వెంటనే బాలు ఓ వీడియో సందేశం విడుదల చేయగా, అందులో తప్పకుండా తిరిగి వస్తా అన్నారు. ఇప్పుడు ఆ మాటను బాలు నిలబెట్టుకోనున్నారు అంటున్నారు.