ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్ధితి విషమిస్తుండటంతో ఆయన కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ ఎంజీఎంకు చేరుకుని బాలు ఆరోగ్య పరిస్ధితి గురించి ఆరా తీశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  ఎస్పీ బాలసుబ్రమణ్యం కండీషన్ విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లుగా తెలిపారు.  సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ సైతం ఇదే చెప్పారు.

నిన్న కూడా ఆయన బాగానే ఉన్నారని.. జ్యూస్ తాగారని కాట్రగడ్డ ప్రసాద్ తెలిపారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.

Also Read:ఎస్పీబీ ఆరోగ్య పరిస్ధితి విషమం: ఆసుపత్రికి చేరుకున్న కమల్ హాసన్

ఎక్మో, వెంటిలేటర్ ఇతర ప్రాణాధార చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా వుందని వెల్లడించారు. వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని బులెటిన్‌‌లో ప్రస్తావించారు.

గత 24 గంటల్లో ఎస్పీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని ఎంజీఎం వర్గాలు తెలిపాయి. కరోనా నుంచి కోలుకున్నాకా ఆయనకు మరోసారి అనారోగ్యం తిరగబెట్టింది