ఎస్పీ తనయుడు చరణ్ హెల్త్‌ అప్‌డేట్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేసిన వీడియోలో ఎస్పీ ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారనీ, మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తమని చెప్పారు. అయితే ఆయన కోలుకుంటారన్న నమ్మకం తామకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు చరణ్.

ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎమ్జీఎం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. ఈ నెల 11 ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి గత 5 రోజులుగా ఆందోళనకరంగా మారింది. అయితే మంగళవారం ఆయన కోలుకున్నట్టుగా వార్తలు రావటంతో అభిమానులు కాస్త స్థిమిత పడ్డారు.

కానీ తాజాగా ఎస్పీ తనయుడు చరణ్ ఇచ్చిన హెల్త్‌ అప్‌డేట్‌లో అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ఈ రోజు ఎస్పీ ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను వీడియో రూపంలో అందిస్తున్న చరణ్ ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేసిన వీడియోలో ఎస్పీ ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారనీ, మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తమని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి గత రెండు రోజులుగా ఎలా ఉందో అలాగే ఉందని క్లారిటీ ఇచ్చాడు.

View post on Instagram