లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5న కొద్ది పాటి లక్షణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. అయితే గురువారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని ప్రకటించటంతో అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

తాజాగా ఎస్పీబీ కోలుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ తమిళ నటుడు ఎస్పీ హాస్పిటల్ బెడ్ మీద థమ్స్‌అప్‌ చిహ్నాన్ని చూపిస్తున్న ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశారు మనోబాల. ఈ ఫోటో బయటకు రావటంతో అభిమానులు కాస్త స్థిమిత పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరస్థితి కాస్త మెరుగుపడిందన్న ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది.

తాజాగా ఎస్పీ భార్య సావిత్రికి కూడా కరోనా పాజిటివ్‌ అని నిర్ధారన అయ్యింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికీ ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ఎక్స్‌పర్ట్‌ డాక్టర్స్‌ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన త్వరలోగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థన చేస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియా వేదిక సంగీత, సినీ కళాకారులు ట్వీట్లు చేస్తున్నారు.