స్టార్ యాక్టర్ హఠాన్మరణం.. షాక్ లో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. అసలేమయ్యింది...?

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సౌత్ నార్త్  అంతట అన్ని ఇండస్ట్రీల నుంచి వరుసగా స్టార్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా సౌత్ ఇండస్ట్రీలో మరో స్టార్ యాక్టర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 
 

South Star Actor Kundara Johny Passed away Due to Heart attack JMS

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సౌత్ నార్త్  అంతట అన్ని ఇండస్ట్రీల నుంచి వరుసగా స్టార్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా సౌత్ ఇండస్ట్రీలో మరో స్టార్ యాక్టర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది స్టార్లు వరుసగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. వరుసగా ఇండస్ట్రీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. శరత్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ,  కళా తపస్వి విశ్వనాద్, ఇలా ఎంతో మంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అంతే కాదు తమిళ, మలయాళ పరిశ్రమల నుంచి ఎంతో మంది నటులు రీసెంట్ గా మరణించారు. ఈ షాక్ ల నుండి సినిమా పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో నటుడు గుండెపోటుతో మరణించారు. 

ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మలయాళ నటుడు కుందర జానీ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయనకి హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కొల్లంలోని ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ డాక్టర్లు అతన్ని కాపాడలేకపోయారు అని తెలుస్తుంది.కుందర జానీ పలు మలయాళం, కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. ఆయన అక్కడ స్టార్ నటుడిగా కొనసాగుతున్నారు. 

మరీ ముఖ్యంగా జానీ ఎక్కువగా ఈయన నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు, విలన్ పాత్రలు పోషించేవారు. 1979లో వచ్చిన నిత్య వసంతం అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన కుందర జానీ..కొన్ని వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తెలుగులో ఈయన కమల్ హాసన్ నటించిన రౌడీయిజం నశించాలి అనే సినిమాలో నటించారు.

ఇక కుందర జానీ మృతితో మలయాళ పరిశ్రమకు షాక్ తగిలినట్టు అయ్యింది. మాలీవుడ్ నుంచి స్టార్స్ ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఇటు తమిళ, తెలుగు పరిశ్రమ నుంచి కూడా సెలబ్రిటీలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios