ఈ యేడు వరుస విజయాలతో ఫుల్ ఖుషీగా వున్న కాజల్ ప్రస్థుతం కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే, క్వీన్ రీమేక్ ప్యారిస్ ప్యారిస్ లో చేస్తున్న కాజల్ వరుస ఆఫర్లతో సంతోషంలో వున్న కాజల్ కు పెళ్లిపై ఆలోచన తనకు పెళ్లిపై మంచి అభిప్రాయం వుందని, చేసుకోవాలనే వుందంటున్న కాజల్
ఈ ఏడాది ఖైదీతో మొదలు మెర్సల్ దాక మొత్తం నాలుగు సూపర్ హిట్స్ అందుకున్న కాజల్ అగర్వాల్ చాలా సంతోషంగా వుంది. ముఖ్యంగా చిరంజీవితో కలిసి ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించడం, ఆయనతో కలిసి స్టెప్పేసే అవకాశం రావడం లాంటివి తనకి ఈ ఏడాది మరింత ఆనందాన్నిచ్చిన విశేషాలు అంటున్న కాజల్ అగర్వాల్... తన పెళ్లి గురించి, పెళ్లిపై తనకున్న నమ్మకం గురించి కూడా చాలా విషయాలే చెప్పింది.
విజయ్ మెర్సల్ లో కాజల్ హిరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈరోజే తెలుగులో 'అదిరింది' పేరిట రిలీజైంది. 'అదిరింది' తర్వాత ప్రస్తుతం కళ్యాణ్ రామ్‌తో కలిసి ఎంఎల్ఏ, క్వీన్ తమిళ రీమేక్ 'ప్యారిస్ ప్యారిస్'( బాలీవుడ్‌లో హిట్ అయిన క్వీన్ సినిమాకు ఇది తమిళ రీమేక్ వెర్షన్) చిత్రాలకి సైన్ చేసింది. చేతిలో ఇంకా బోలెడన్ని అవకాశాలు వుండటంతో ఇప్పుడప్పుడే తనకి పెళ్లి చేసుకునే మూడ్ లేదంటున్న కాజల్... కాకపోతే వివాహ వ్యవస్థపై తనకి బలమైన నమ్మకం మాత్రం వుందని చెబుతోంది.
"తనకి పెళ్లి చేసుకోవాలని అనిపించినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. తనకి కాబోయే వాడు పెద్ద అందగాడు అయ్యుండాలని ఏమీ కోరుకోవడం లేదు. కాకపోతే తనని బాగా చూసుకునే మంచి మనసున్న, నిజాయితీగల మనిషి అయితే అంతే చాలు" అని కాబోయేవాడికి వుండాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి కూడా స్పష్టంచేసింది కాజల్ అగర్వాల్. తనకు వివాహం చేసుకోవాలనిపించినప్పుడు వివరాలు తప్పక చెప్పే చేసుకుంటానంటోందీ చందమామ.
