సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఆయన మనవడు వేద్ అనుకరిస్తున్నాడు. ఈ విషయాన్ని రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ స్వయంగా వెల్లడించింది. రజినీకాంత్ స్టైల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆయనలా నడవాలని, మాట్లాడాలని తెగ ప్రయత్నిస్తుంటారు.

అలాంటిది ఇంట్లో ఉండే వేద్ మాత్రం ఊరుకుంటాడా..? తన తాతను ఫాలో అవుతూ ఫోటోలకు ఫోజులిస్తున్నాడు. రజినీకాంత్ నిల్చునే విధంగానే వేద్ కూడా స్టైల్ గా నిల్చున్నాడు. అలా వేద్ తాతను ఇమిటేట్ చేసేలా ఉన్న ఫోటోను సౌందర్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫోటోకి 'తాతాలాగే మనవడు' అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు వేద్ క్యూట్ గా పోజ్ ఇచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు తలైవాని తాత అని పిలవకండి ప్లీజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం రజినీకాంత్.. మురుగాదాస్ దర్శకత్వంలో 'దర్బార్' సినిమాలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.