సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్ తన భర్త అశ్విన్ తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఏడేళ్ల తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేశారు.

ప్రస్తుతం తన కొడుకుతో జీవిస్తోన్న సౌందర్య రెండో పెళ్లికి సిద్ధమైంది. వ్యాపారవేత్త విషాగన్ వనంగముడితో ఆమెకి నిశ్చితార్ధం కూడా జరిగింది. ఇప్పుడు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు కుటుంబసభ్యులు. ఈ ఏడాది ఫిబ్రవరి 11న వీరి వివాహం జరగబోతుంది. రజినీకాంత్ ఇంట్లోనే ఈ వేడుకను నిర్వహించాలని భావిస్తున్నారు.

అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కాబోతుంది. ఈ పెళ్లి వేడుకను వీలైంతసింపుల్ గా చేయాలనేది రజినీకాంత్ ఆలోచన. అందుకే కనీసం పెళ్లి శుభలేఖలను కూడా అచ్చు వేయించడం లేదు. బంధువులు, సన్నిహితులను వాట్సాప్ ద్వారానే ఆహ్వానించబోతున్నారని సమాచారం.

పెళ్లికి ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 10న గెట్ టు గథెర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త వనంగముడి కొడుకే విషాగన్. విషాగన్ కి సొంతంగా ఫార్మసిటకల్ కంపనీ కూడా ఉంది. ఇక సౌందర్య విషయానికొస్తే 'కొచ్చాడియాన్' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన బావ ధనుష్ హీరోగా 'విఐపి2' సినిమాను తెరకెక్కించింది.