రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్ గతేడాది తన భర్త అశ్విన్ తో విడాకులు తీసుకుంది. అభిప్రాయబేధాలు కారణంగా వీరిద్దరూ తమ ఏడేళ్ల పెళ్లి బంధానికి స్వస్తి చెప్పారు. అప్పటినుండి సౌందర్య తన ఐదేళ్ల కొడుకుతో కలిసి జీవిస్తోంది.

ఇప్పుడు ఆమె రెండో పెళ్లికి సిద్ధమైందని సమాచారం. రీసెంట్ గా వ్యాపారవేత్త విషాగన్ వనంగముడితో ఆమెకి నిశ్చితార్ధం జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. విషాగన్ కి కూడా ఇది రెండో పెళ్లే.. అతడికి తమిళ సినిమాలతో బంధం కూడా ఉంది.

మనోజ్ బీద తెరకెక్కించిన 'వంజగర్ ఉలగం' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. 'సిగప్పు రోజక్కల్2' సినిమాలో హీరోగా నటించాల్సివుంది కానీ వర్కవుట్ కాలేదు.

ప్రముఖ వ్యాపారవేత్త వనంగముడి కొడుకే విషాగన్. విషాగన్ కి సొంతంగా ఫార్మసిటకల్ కంపనీ కూడా ఉంది. ఇక సౌందర్య విషయానికొస్తే 'కొచ్చాడియాన్' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన బావ ధనుష్ హీరోగా 'విఐపి2' సినిమాను తెరకెక్కించింది.