Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ కప్‌లో ధోనీ ఎట్లనో, `సౌండ్‌ పార్టీ`లో నేనూ అంతే.. యంగ్ బ్యూటీ క్రేజీ కామెంట్స్..

సీనియర్ నటి ఆమని మేనకోడలు హృతిక హీరోయిన్‌గా ప్రస్తుతం `సౌండ్‌ పార్టీ` చిత్రంలో నటించింది. అయితే ఇందులో పాత్రని ఆమె ఎంఎస్‌ ధోనీతో పోల్చుకోవడం క్రేజీగా ఉంది.

sound party heroine crazy comparison with ms dhoni in world cup arj
Author
First Published Nov 19, 2023, 7:14 PM IST

క్రికెట్‌లో, ముఖ్యంగా వరల్డ్ కప్‌లో ఎంఎస్‌ ధోనీ ఎలా అయితే చివర్లో సిక్స్ లతో మ్యాజిక్‌ చేస్తూ, సర్‌ప్రైజ్‌ చేస్తాడో, తాను కూడా `సౌండ్‌ పార్టీ` సినిమాలో అలానే అంటోంది యంగ్‌ బ్యూటీ హృతికా శ్రీనివాస్‌. ఆమె సీనియర్‌ నటి ఆమని మేనకోడలు కావడం విశేషం. బిగ్‌ బాస్‌ 5 విన్నర్ వీజే సన్నీతో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం `సౌండ్‌ పార్టీ`. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది. సంజయ్‌ శౌరీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జయశంకర్‌ సమర్పిస్తున్నారు. రవిపొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్యామ్‌ గజేంద్ర నిర్మాతలు. సినిమా విడుదలకు దగ్గరపడుతున్న నేపథ్యంలో హీరోయిన్‌ హృతిక శ్రీనివాస్‌ మీడియాతో ముచ్చటిస్తూ, క్రేజీగా పోల్చుకుంది. 

ఎంఎస్‌ ధోనీతో ఆమె పోల్చుకుంటూ ధోని మ్యాచ్‌ చివర్లో సిక్స్ కొట్టి మ్యాచ్‌లను గెలిపిస్తాడో, తాను కూడా సర్‌ప్రైజ్‌ చేస్తూ సినిమాలో ట్విస్ట్ ఇస్తానని తెలిపింది. హృతిక.. ఆమని మేనకోడలు కావడంతో ఆమెని స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చినట్టు చెప్పింది. `చిన్నప్పట్నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. తాను భరతనాట్యం వంటి క్లాసిక్‌ డాన్స్ తోపాటు వెస్ట్రన్‌ డాన్సు కూడా నేర్చుకున్నట్టు చెప్పింది. అయితే హీరోయిన్‌ కావాలనుకున్నప్పుడు ఆమని అత్తకి చెబితే ఆమె ఎందుకు రిస్క్ అన్నది. ఆసక్తి ఉంటే ఓకే, కానీ ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా సవాళ్లని ఫేస్‌ చేయాల్సి వస్తుంది, రిస్క్ తీసుకోవాలి, అందుకు సిద్ధమేనా అని చెబితే, తనకు ఓకే అన్నాను. అలా తాను నటిగా మారాను` అని చెప్పింది హృతిక.

మొదట తమిళం, కన్నడలో సినిమాలు చేసిందట. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్‌ గానూ రెండు సినిమాలు చేసినట్టు తెలిపింది. తెలుగులోనూ ఓ మూవీ చేశానని, ఇది తెలుగులో రెండో మూవీ అని చెప్పింది. అయితే అవకాశాల విషయంలో అత్త ఆమని సపోర్ట్ ఉందని చెప్పింది. ఆమె ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. కానీ వచ్చిన అవకాశాల్లో ఏ మూవీ చేయాలనేది తన నిర్ణయమే అని, ఫ్యామిలీతో కలిసి సినిమాని ఫైనల్‌ చేస్తానని తెలిపింది. ఇక్కడ రాణించాలంటే మన ప్రతిభ, సక్సెస్‌ పనిచేస్తాయని, పెద్దవాళ్లు సపోర్ట్ మాత్రం చేయగలరని, అంతిమంగా నిరూపించుకోవాల్సింది మనమే అని వెల్లడించింది. 

ఇక `సౌండ్‌ పార్టీ` సినిమా గురించి చెబుతూ, తండ్రికొడుకుల కథ ఇది అని, ఈజీ వేలో డబ్బు సంపాదించాలనుకుంటారు. అందుకోసం ఏం చేశారు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఎంతటి సహసాలు చేశారనేది మూవీ. ఈ ప్రాసెస్‌ అంతా చాలా ఫన్నీగా ఉంటుంది. సినిమా ఆద్యంతం ఫన్‌రైడర్‌లా సాగుతుంది. ఇందులో తన పాత్రకి ప్రయారిటీ ఉంటుంది. సినిమా చాలా వరకు నా పాత్ర చుట్టే తిరుగుతుంది. చివరికి నా పాత్ర ట్విస్ట్ హైలైట్ అవుతుంది. సన్నీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్‌లో ఆయన ఉంటే ఎప్పుడూ సందడిగా, ఫన్నీగా ఉంటుంది. షూటింగ్‌ కూడా ఆడుతూ పాడుతూ చేసినట్టు ఉంటుందని తెలిపింది హృతిక. ఈఅవకాశం ఇచ్చిన తనకు ఎంతో సపోర్ట్ చేసిన దర్శక, నిర్మాతలకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. నిర్మాతలు దగ్గరుండి చూసుకున్నారని వెల్లడిచింది. 

ప్రస్తుతం తెలుగులో మరో రెండు మూడు సినిమాలు చేస్తున్నట్టు తెలిపింది. తనకు నచ్చిన హీరోయిన్‌ సాయిపల్లవి అని, ఆమె ఎంచుకునే పాత్రలు, నటన చాలా బాగుంటాయని, భిన్నంగా ఉంటాయని తెలిపింది. అలాగే నచ్చిన హీరో నాని అని చెప్పింది. ఆయన నటన బాగా నచ్చుతుందని పేర్కొంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios