ట్రైలర్ అప్లోడ్ చేయబోయి సినిమా చేశారు!

First Published 4, Jul 2018, 3:24 PM IST
Sony Pictures accidentally upload entire movie to Youtube instead of trailer
Highlights

కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తూ పైరసీ బారిన పడకుండా ఎన్నో జాగ్రతలు తీసుకుంటూ ఉంటారు. సినిమాకు సంబంధించిన ఎలాంటి వీడియో, ఫోటోలు బయటకు వచ్చినా.. భారీగా నష్టపోతుంటారు. కానీ ఒక్కోసారి చేసే సొంత తప్పిదాల కారణంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుంది

కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తూ పైరసీ బారిన పడకుండా ఎన్నో జాగ్రతలు తీసుకుంటూ ఉంటారు. సినిమాకు సంబంధించిన ఎలాంటి వీడియో, ఫోటోలు బయటకు వచ్చినా.. భారీగా నష్టపోతుంటారు. కానీ ఒక్కోసారి చేసే సొంత తప్పిదాల కారణంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుంది.

అటువంటి సంఘటనే ఎదురైంది సోనీ పిక్చర్స్ సంస్థకు. జూలై ౩వ తారీఖుల సోనీ సంస్థ తమ యూట్యూబ్ ఛానెల్ లో 'రెడ్ బ్యాండ్' అనే సినిమా ట్రైలర్ ను విడుదల చేయాలి. కానీ దానికి బదులుగా 'ఖాళీ ది కిల్లర్' అనే మొత్తం సినిమాను అప్లోడ్ చేశారు. ఈ విషయాన్ని అప్లోడ్ చేసిన ఎనిమిది గంటల తరువాత గుర్తించారు. అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. యూట్యూబ్ లో ఎందులో నెటిజన్లు ఈ సినిమాను చూసేశారు.

ఇక చేసేదేంలేక సోనీ సంస్థ ఆ సినిమాను రెంటల్ బేసిస్ పైన దొరికే విధంగా చర్యలు తీసుకుంది. రిచర్డ్ కాబ్రల్ నటించిన ఈ సినిమాను జాన్ మాత్యూస్ డైరెక్ట్ చేశారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటర్నెట్లో ఈ సినిమాను చూసిన కొందరు నెటిజన్లు సోనీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ కు థాంక్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.   

loader