Asianet News TeluguAsianet News Telugu

తన పేరుతో భారీ మోసాలు.. సోనూసూద్‌ వార్నింగ్‌

 సోనూ సూద్‌ కి కోపం వచ్చింది. అంతేకాదు కొందరుదుండగులకు గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. అలాంటి పనులు చేస్తే బాగుండదని హెచ్చరించాడు. మరి రియల్‌ హీరోకి ఎందుకు కోపం వచ్చిందనేగా? ఆ వివరాల్లోకి వెళితే.. 

sonusood warning to fraudsters  arj
Author
Hyderabad, First Published Mar 8, 2021, 7:46 AM IST

ఆపదలో ఉన్న వారిని తనవంతుగా ఆదుకుంటూ,  సాయం చేస్తూ రియల్‌ హీరో అనిపించుకున్న సోనూ సూద్‌ కి కోపం వచ్చింది. అంతేకాదు కొందరుదుండగులకు గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. అలాంటి పనులు చేస్తే బాగుండదని హెచ్చరించాడు. మరి రియల్‌ హీరోకి ఎందుకు కోపం వచ్చిందనేగా? ఆ వివరాల్లోకి వెళితే.. తన పేరుతో కొందరు దుండుగులు మోసాలకు పాల్పడటమే. `సోనూ సూద్‌ ఫౌండేషన్‌` పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారు. 

సోనూ సూద్‌ లెటర్‌ హెడ్‌పై డబ్బులు వసూలు చేస్తున్నారు దుండగులు. అమాయకులను టార్గెట్‌ గా చేసుకుని ఇలాంటి పనులకు పాల్పడుతున్నాడు. మరోవైపు సోనూ సూద్‌ లెటర్‌ హెడ్‌ పేరుతో 60 నెలలు వాయిదాల చొప్పున, 5లక్షల లోన్‌ తీసుకునే విధంగా తమ ఫౌండేషన్‌ సౌకర్యం కలుగచేస్తోందని అమాయకుల దగ్గర నుంచి కొందరు అక్రమార్కులు డబ్బు వసూలు చేస్తున్నారు. అయితే ఈ లెటర్‌ హెడ్‌ ఇవ్వడానికి మొదట ప్రతి ఒక్కరు 3500రూపాయలు చెల్లించాలని కండీషన్‌ పెట్టారు. ముందుగా ఈ మొత్తం చెల్లించిన వారికి వెంటనే లోను శాంక్షన్‌ అవుతుంది. ప్రతి నెల ఎనిమిదివేలు కట్టాలని చెప్పారు. 

ఈ విషయం సోనూ సూద్‌కి చేరింది. ట్విట్టర్‌ ద్వారా సోనూ సూద్‌ ఈవిషయాన్ని ఖండించాడు. నేను ఇలాంటి రుణాలు ఇస్తానని ఎక్కడ, ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండమన్నారు. ఈ కాల్స్ వచ్చే నెంబర్‌ 9007224111 అని లెటర్‌ హెడ్‌లోని నెంబర్‌ని పేర్కొన్నారు. అంతేకాదు దీనిపై ఉత్తరప్రదేశ్‌, ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కేటుగాళ్లకి వార్నింగ్‌ ఇచ్చారు సోనూసూద్‌. తన పేరుతో ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోనని వెల్లడించారు. ప్రస్తుతం సోనూ సూద్‌ తెలుగులో `ఆచార్య` చిత్రంతోపాటు పలు చిత్రాల్లో నటిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios