రియల్ హీరో సోనూ సూద్ టైలర్ గా మారారు. ఆయన స్వయంగా బట్టలు కుడుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే దానికి ఓ ఫన్నీ కామెంట్ కూడా పెట్టడం జరిగింది. సోనూ సూద్ టైలర్స్... ఇక్కడ బట్టలు ఉచితంగా కుట్టబడును. కాకపోతే మీ ప్యాంటు కాస్తా నిక్కరు కావచ్చు, అని కామెంట్ పెట్టారు. సోనూ సూద్ సోషల్ మీడియా పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. నెటిజెన్స్ అనేక రకాల కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. 

ప్యాంటు... నిక్కరైనా పర్లేదు, మీరు బట్టలు కుట్టాలంటే ఏం చేయాలని కామెంట్స్ పెడుతున్నారు. కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ సామాన్య ప్రజలకు అందించిన సేవలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. వేల మందిని సొంత గ్రామాలకు సొంత డబ్బులతో ఇళ్లకు పంపిన సోనూ సూద్, సోషల్ మీడియా వేదికగా ఎవరు, ఏ విన్నపం చెప్పుకున్నా అడిగిందే తడవుగా తీర్చారు. 

ప్రస్తుతం సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లుడు అదుర్స్ మూవీలో సోనూ సూద్ కీలక రోల్ చేయడం జరిగింది. అలాగే దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలో సోనూ సూద్ ఓ పాత్ర చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉంది.